ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ల భార్యలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వారు ఎక్కడ దాక్కున్నారో ఎవరికీ తెలీదు.
గ్యాంగ్ స్టర్ అతీఖ్ అహ్మద్, అతడి తమ్ముడు అష్రఫ్ అహ్మద్ ల హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక ఈ కేసులను తీవ్రంగా తీసుకుంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఇప్పటికే గ్యాంగ్ స్టర్స్ పై ఉక్కుపాదం మోపుతున్న యోగి సర్కార్.. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి భార్యలపై ఫోకస్ పెట్టింది. పోలీసులకు దొరకుండా చుక్కలు చూపిస్తున్న అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్, అష్రఫ్ భార్య అయిన జైనాబ్ లు ఇంటికి తాళం వేయకుండా పరారయ్యారు.దాంతో వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు స్పెషల్ టీమ్ లుగా ఏర్పడి జల్లెడ పడుతున్నారు. అయినా వారి ఆచూకీ తెలియడం లేదు. దాంతో వారు ఎక్కడ దాక్కున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
అతీఖ్ అహ్మద్.. ఉత్తరప్రదేశ్ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్. ఇటు రాజకీయాలను కూడా తన కనుసనల్లో శాసించేవాడు. అతడి నేర సామ్రాజ్యాన్ని నడపడంలో షైస్తా పర్వీన్ కీలకంగా వ్యవహరించేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అతీఖ్ జైలులో ఉన్నసమయంలో అన్ని సెటిల్ మెంట్ లు ఆమె చూసుకునేది.ఇక అతీఖ్ మరణం తర్వాత నుంచి షైస్తా పర్వీన్ ఆచూకీ అభించడం లేదు. ఆఖరికి అతడి అంత్యక్రియలకు కూడా ఆమె హాజరుకాలేదు. అయితే తాజాగా షైస్తా ఓ పెళ్లిలో బుర్ఖా ధరించకుండా పాల్గొన్నారన్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక మరో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ భార్య అయిన అఫ్షా అన్సారీ పై ఉత్తరప్రదేశ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమె పై 11 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. దాంతో పాటుగా అఫ్షా అన్సారీ తలపై రూ. 50 రివార్డు కూడా ఉంది. ప్రస్తుతం ఈమె భర్త జైలులో ఉన్నాడు.
ఇక షైస్తా పర్వీన్, జైనాబ్, అఫ్షా అన్సారీ ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. వీరి ముగ్గురి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారు ఎక్కడ దాక్కున్నారో కూడా చిన్న క్లూ సైతం పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో గ్యాంగ్ స్టర్ల భరతం పడుతున్నాడు. ఇప్పటి వరకు 183 మందిని ఎన్ కౌంటర్ చేయగా.. 15 వేల మందికి పైగా అరెస్ట్ చేశారు. వేల కోట్ల గ్యాంగ్ స్టర్ల ఆస్తులను జప్తు చేశారు. దాంతో గ్యాంగ్ స్టర్లు కుటుంబాలతో సహా వేరే ప్రాంతాల్లో, వేరే రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇక పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ల భార్యలను ఎప్పుడు పట్టుకుంటారో వేచి చూడాలి.