ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర సర్కార్ నిషేధించిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రాష్ట్రాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొందరు వ్యాపారులు అయితే ప్లాస్టిక్ వస్తువులు ఇస్తే నిత్యవసర వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారు. తాజాగా ఖాళీ పాల ప్యాకెట్లు ఇస్తే పెట్రోల్,డీజిల్ పై డిస్కౌంట్ ఇస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ లోని భిల్వార్ జిల్లకా చెందిన అశోక్ కుమార్ ముంద్రా..ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకుని పెట్రోల్, డీజిల్ పై డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్లాస్టిక్, పాలిథిన్ వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఒక ఖాళీ లీటర్ పాల ప్యాకెట్ లేదా రెండు హాఫ్ లీటర్ ప్యాకెట్లు లేదా లీటర్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకోస్తే లీటర్ పెట్రలో పై రూ.1 , డీజిల్ పై 50 పైసలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంధన పంపు వద్ద రీడీమ్ చేసుకోగలిగే కూపన్‌లను ప్రజలకు అందజేస్తున్నారు. ఈ ఆఫర్ ఆరు నెలల పాటు కొనసాగుతోంది.
అశోక్ మాట్లాడుతూ…”భిల్వారా పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చూడాలనుకుంటున్నాను. ప్లాస్టిక్.. పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ముప్పు కలిగిస్తుంది. అందుకే ప్రజల్లో అవగాహన కలిపించేందుకు ఈ కార్యక్రామాన్నికి పూనుకున్నాను” అని ఆయన చెప్పారు. మరి.. అశోక కుమార్ చేస్తున్న ఈ ప్లాస్టిక్ నిర్మూల అవగాహనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.