గత కొంతకాలంగా భాషా పరమైన వివాదాలు తమిళనాట తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుందని కేంద్రంపై తమిళనాడు సర్కార్ మండిపడుతుంది. తమ ఇష్టానికి అనుగుణంగా హిందీ లో పేర్లు మార్చడం.. తమ మాతృ భాషను అవమానించినట్లు అని తమిళనాడు సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
గత కొంత కాలంగా తమిళనాట భాషాపరమైన వివాదం కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగిస్తూ వస్తుంది తమిళనాడు ప్రభుత్వం. తాజాగా తమిళనాడులో మరోసారి హింది వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు కో ఆపరేటీవ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ అవిన్ తమ ప్రొడక్ట్స్ పై పెరుగు కు బదులు హిందీ పదమైన దహి ని ముంద్రించడంతో వివాదం చెలరేగింది. అయితే భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అయిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాల ప్రకారమే తాము పెరుగు ప్యాకెట్ పై దహి అనే పేరును ముద్రించామని చెప్పింది సంస్థ. దీంతో ఇది కాస్త రాజకీయ వివాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొంతకాలంగా హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తుంది తమిళనాడు సర్కార్. ఈ క్రమంలోనే ఇప్పుడు పెరుగు వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు మిల్క్ ప్రొడక్ట్స్ పై హిందీ పేరు ప్రచురించడంపై సీఎం స్టాలిన్ సహా పలువురు నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్ లో కర్డ్, తమిళంలో ఉన్న తయర్ పేరు తొలగించి ‘దహి’ అనే పదం ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ – ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతో పాటు నెయ్యి, చీజ్ వంటి డైరీ ఉత్పత్తుల పేర్లు సైతం ఇలాగే మార్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. కేవలం తమిళనాడులోనే కాదు.. కర్ణాటకకు కూడా ఇదే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. హిందీని బలవంతంగా రుద్దాలని కేంద్రం పన్నుతున్న కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పెరుగు ప్యాకెట్స్ పై కూడా తమిళంలో ఉన్న పేరు మార్చేసి హిందీలో రాయమని చెప్పడం సరైన పద్దతి కాదని ఆగ్రహించారు. మాతృభాషల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం ఎవరూ సహించబోరని స్టాలిన్ ధ్వజమెత్తారు. అంతేకాదు ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సైతం వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సాహించాలని.. ఈ విధానాలపై ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పై మండిపడ్డారు. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి సైతం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయంపై మండిపడ్డారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నందిని బ్రాండ్ పేరు మార్చడంపై వ్యతిరేకించారు. ఇది కన్నడీగుల ఆస్తి అని అన్నారు.
ఇక రాజకీయ, ప్రజా వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీ భాషతో పాటు, ఇంగ్లీష్, స్థానిక భాషల్లో కూడా పెరుగు ప్యాకెట్లపై పేర్లను బ్రాకెట్లలో రాసుకోవచ్చిన సూచించింది. ఈ సంస్థ ఇచ్చిన ఆదేశాలను సవరించుకుంది. ప్రస్తుతం ఉన్న సవరణ ప్రకారం… కర్డ్ (దహీ-హిందీ), కర్డ్ (తాయిర్-తమిళం) కర్డ్ (మోసారు-కన్నడ) కర్డ్ ( పెరుగు- తెలుగు) పదాలను వాడుకోవచ్చని సూచించింది. ప్రజాభిష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.