నాలుగేళ్ల బాలిక సాహస యాత్ర.. కాలినడకన నది చుట్టూ 3500 కి.మీ. ప్రదక్షిణ!

సంకల్పం ఉంటే మనిషి ఎలాంటి లక్ష్యానైనా ఈజీగా సాధించగలడు. అలా ఎందరో తమ పట్టువిడని ఉక్కు సంకల్పంతో  లక్ష్యాలను సాధించి చరిత్రలో నిలిచారు. అయితే పట్టుదలతో అనేక కఠినమైన లక్ష్యాలను ఎదుర్కొంటూ విజేతలుగా నిలిచిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎందరో పిల్లలలు తమదైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా రాజేశ్వరి అనే నాలుగేళ్ల చిన్నారి కూడా ఓ అరుదైన యాత్ర చేపట్టింది. అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. నది చుట్టూ కాలినడకన 3500 కి.మీ ప్రదక్షిణ ప్రారభించింది. చాలా మంది భయంతో వెనకడుగు వేసే ఈయాత్రను రాజేశ్వరి ఇప్పటికే సగం పూర్తి చేసింది. మరో రెండు నెలల్లో తన పూర్తి పాదయాత్రను పూర్తి చేయనుంది. ప్రస్తుతం ఈ నాలుగేళ్ల చిన్నారి అరుదైన యాత్ర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రకు చెందిన నాలుగేళ్ల రాజేశ్వరి అనే బాలిక.. తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు ‘నర్మదా పరిక్రమ’ పేరుతో నది చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అలానే ఈ ప్రాంతం నుంచి కూడా వందల మంది ఈ నర్మదా పరిక్రమ యాత్ర చేస్తుంటారు. అలానే ఈ ఏడాది రాజేశ్వరి నివాసం ఉండే ప్రాంతంలోని ఓ ఆరు కుటుంబాల వారు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. వారితో పాటు రాజేశ్వరి కూడా నర్మద నది చుట్టు కాలినడక యాత్రకు సిద్ధమైంది. అలా అక్టోబరు 12న ప్రారంభమైన యాత్ర ఇంకా కొనసాగుతోంది. ఈ చిన్నారి కాలినడకన రోజూ 25 కి.మీ. ప్రదక్షిణ చేస్తోంది. మార్గం మధ్యంలో రాళ్లు రప్పలు, ముళ్లపొదలను దాటుకుంటూ ముందుకు ఈ చిన్నారి సాగుతోంది.

ఈ నాలుగేళ్ల చిన్నారి ఉక్కు సంకల్పం చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే రెండు నెలల యాత్రను ఈ చిన్నారి పూర్తి చేసుకుంది. ఇంకా ఈ నది ప్రదక్షిణ మరో రెండు నెలలపాటు సాగనుందని పాప కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ యాత్ర పూరయ్యే నాటికి ఆ పాప నది చుట్టూ 3500 కి.మీ దూరం నడవనుంది. బుడిబుడి అగులు వేస్తూ తోటి వారితో ఆ చిన్నారి నడవటం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం రాజేశ్వరి పాదయాత్ర విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి ధైర్యానికి నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి.. ఈ చిన్నారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV