కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో ఓ చిన్నారి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందికి సెల్యూట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి చేసిన గొప్ప పనికి అందరూ ఫిదా అవుతున్నారు.. దేశ భక్తి అంటే ఏంటో తెలియని అంత చిన్న వయసులో ఆ బాలుడు చేసిన పనికి హృదయాలు ఉప్పోంగి పోతున్నాయిన నెటిజన్లు అంటున్నారు. 4 ఏళ్ల వీర్ అర్జున్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం దగ్గర తన తండ్రితో చేయి చేయిపట్టుకుని నడుస్తూ వెళ్తున్నాడు.
ఆ చిన్నారి అకస్మాత్తుగా తన ముందు ఉన్న సాయుధ CISF వాహనాన్ని గమనించాడు. లోపల నిలబడి ఉన్న జవాన్‌ని గమనించి వాహనం ముందు ఆగిపోయాడు. అలాగే వాహనం వైపు చూస్తూ అందులో జవాన్ కి తన చేతిని పైకి లేపి వందనం చేశాడు. లోపల నిలబడి ఉన్న సిబ్బంది బాలుడి సెల్యూట్‌కి సమాధానంగా చిరునవ్వుతో తన చేతిని పైకి లేపారు.
ఈ క్లిప్‌ను వీర్ తండ్రి అక్టోబర్ 24న తొలిసారిగా ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇలా వ్రాశాడు..ఇండియన్ ఆర్మీ.. మన స్వంత సూపర్‌హీరోలు. కాగా, బెంగుళూరు విమానాశ్రయంలో జవాన్లకు సెల్యూట్ చేస్తున్న చిన్నారి వీడియో వైరల్‌గా మారింది.
Indian Army 🪖🇮🇳
Our own Superheroes ❤️@PMOIndia @rashtrapatibhvn @adgpi @IAF_MCC #ARMY #IndianArmy #India #indiaVsPakistan #IndianCricketTeam #Indian #veerarjun #Arjunms #IndianAirForce #salute pic.twitter.com/c9ck8vFva3— Arjun MS 🇮🇳 (@iamArjunMS) October 24, 2021