బస్సులు, రైళ్లల్లో సీట్ల కోసమే.. ఇతర కారణాల వల్లనో ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం.. కానీ ఈ మద్య వెరైటీగా విమానాల్లో అదీ గాల్లో ఉండగా ప్యాసింజన్లు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు.. విమాన సిబ్బందిపై దాడులు చేస్తున్నారు.. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
సాధారణంగా కొంతమంది బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం తిట్టుకోవడం.. కొట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఈ మద్య సీట్ల కోసమే..ఇతర కారణాల వల్లో విమానాల్లో కూడా గొడవలు పెట్టుకోవడం మొదలు పెట్టారు. తోటి పయాణీకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. గొడవ పెట్టుకోవడం.. కొన్నిసార్లు భౌతిక దాడులకు కూడా పాల్పపడుతున్నారు. మద్యం మత్తులో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన సంఘటనలు ఉన్నాయి.. ఇక క్రూ సిబ్బందిపై చేయి చేసుకోవడం వంటి ఘటనలు గత కొంత కాలంగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనే ఓ విమానంలో చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే అందులో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు కొట్టుకోవడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కెయిర్స్ నుంచి నార్త్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో నలుగురు మహిళల మద్య గొడవ మొదలైంది. తాము ఒక ఫ్లైట్ లో ఉన్నామన్న విషయం మరిచిపోయి కొట్టుకున్నారు. కెయిర్స్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటిమే ఓ 23 ఏళ్ల యువతి విమాన సిబ్బందితో గొడవకు దిగింది. ఆమెను ఎంత వారించినా వినకుండా పక్కన ఉన్న ప్యాసింజర్లతో సైతం గొడవకు దిగడంతో చేసేదేమీ లేక విమానాన్ని వెనక్కి తిప్ప యువతిని క్విన్స్ లాండ్ లో దింపేశారు. తిరిగి విమానం టేకాఫ్ కాగానే ఆ యువతి బంధువులు గొడవ చేయడం ప్రారంభించారు.
విమానం గాల్లో ఉండగానే యువతి బంధువులు విమాన సిబ్బంది, తోటి ప్యాసింజర్లపై గొడవకు దిగారు. ఈ గొడవ తారాస్థాయికి చేరుకొని ఓ మహిళ ఏకంగా మరో మహిళలపై గాజు సీసాతో దాడి చేసింది. విమానంలో ఉన్న ఫర్నీచర్ కూడా దెబ్బతిన్నది. వాళ్ల గొడవ చూసి మిగతా ప్యాసింజర్లు భయంతో వణికిపోయారు. విమాన సిబ్బంది గొడవ పడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించినా వారి తరం కాలేదు. ఈ విషయం గురించి విమాన అధికారులతో సంప్రదింపులు జరిపి.. దగ్గరలోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. గొడవకు కారణం అయిన ఇద్దరు మహిళలను, ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు కారణం అయిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Departing Cairns today..
Just someone trying to glass someone.
More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM
— Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023