సమాజంలో అడ్డదారులో సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సామాన్య ప్రజల నుంచి వివిధ మార్గాల్లో డబ్బులను సేకరించి.. అక్రమంగా కూడబెడుతున్నారు. అయితే ఈ అవినీతి చేసే వారు.. ఆ రంగం, ఈరంగ అని తేడా లేకుండా.. అన్ని చోట్ల ఉన్నారు. తాజాగా మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట భారీగా నగదు పట్టుబడ్డాయి.
సమాజంలో అడ్డదారులో సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సామాన్య ప్రజల నుంచి వివిధ మార్గాల్లో డబ్బులను సేకరించి.. అక్రమంగా కూడబెడుతున్నారు. అయితే ఈ అవినీతి చేసే వారు.. ఆ రంగం, ఈరంగ అని తేడా లేకుండా.. అన్ని చోట్ల ఉన్నారు. ముఖ్యంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగుల, ఛైర్మన్లు ఎండీలు పదవులను, అధికారాలను అడ్డు పెట్టుకుని డబ్బుల కట్టలను వెనకేసుకుంటున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కట్టకటాల పాలవుతున్నారు. తాజాగా వాప్కాస్ మాజీ ఎండీ ఇంట్లో భారీగా నగదను పట్టుబడింది.
కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేసే వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్(WAPCOS) ఇండియా లిమిటెడ్ మాజీ సీఎండీ రాజీందర్ కుమార్ గుప్తా ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆయనకు చెందిన నివాసాల్లో సీబీఐ ఏకకాలంలో దాడుల్లో ఇప్పటివరకు మొత్తంగా రూ.38. కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఈ తనిఖీల్లో ఆదాయానికి మించి ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. గుప్తాపై ఇటీవల కేసులు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గుప్తాతో పాటు ఆయన తనయుడు గౌరవ్ సింఘాల్‌ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక రాజీందర్ కుమార్ గుప్తా విషయానికి వస్తే.. 2011 ఏప్రిల్ నుంచి 2019 మార్చి 31 మార్చి 31 వరకు వాప్ కాస్ సంస్థలో సీఎండీగా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో భారీగా అక్రమ ఆదాయలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల వచ్చాయి.
ఈ నేపథ్యంలో రాజిందర్ కుమార్ గుప్తాతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, సోనిపట్, ఘజియాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 19 చోట్ల సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భాగంగా సోమవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. నిన్న మరో రూ.18 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారీగా నగదుతో పాటు నగలు, విలువైన ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పలు దస్త్రాలను సైతం స్వాధీనం చేసుకునట్టు తెలిపారు. అలానే వివిధ ప్రాంతాల్లో ఫామ్ హౌస్ లు కూడా అన్నట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరి.. ఈ భారీ అవినీతిపై కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Cash worth more than Rs 20 crore recovered in CBI raids at 19 locations of Rajendra Kumar Gupta, former CMD of Jal Shakti Ministry’s government company. #CashCrunchNation #Demonetisation #हरा_गुलाबी
News credit: @arvindchotia pic.twitter.com/2CixI726Hl— Navdeep Singh (@wecares4india) May 2, 2023