చిన్నతనంలో చదువుల్లో రాణించాలని భావించేవారు.. కొన్ని అనివార్య కారణాల వల్ల మద్యలోనే ఆపేస్తుంటారు. అలాంటివారు జీవితంలో సెటిల్ అయ్యాక.. తిరిగి చదువుపై ఆసక్తి కనబరుస్తంటారు. వయసుతో సంబంధం లేకుండా ఉన్నత విద్యకోసం పరీక్షలు రాస్తుంటారు.
సాధారణంగా విద్యార్థి దశలో చదువుకోవాలని ఎంత కోరిక ఉన్నా.. కొన్ని అనివార్యకారణాల వల్ల చదువు మద్యలోనే ఆపేసి జీవితంలో సెటిల్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కొంతమందికి విద్యార్థి దశలో ఆపేసిన చదువును తిరిగి కొనసాగించాలని ఆసక్తి కనబరుస్తారు. పరీక్షలు రాస్తూ విద్యపట్ల తమకు ఉన్న ఆసక్తి చాటుకుంటారు. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సైతం గతంలో తాము ఆపేసిన చదువును తిరిగి కొనసాగించిన సందర్బాలు ఉన్నాయి. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటర్ పరీక్షలు రాస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే..
విద్యార్థి దశలో చదువు ఆపివేసిన వాళ్లు.. మళ్లీ చదువు కొనసాగించడానికి ఉత్సాహం చూపుతుంటారు. కొంతమంది చదువు మద్యలో ఆపేసి ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఉన్నతవిద్య కోసం మళ్లీ విద్యార్థుల్లా మారిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారి జాబితాలో చేరారు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన బీజేపీ నేత.. మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా.. ఈయన వయసు 51 సంవత్సరాలు. ఆయన ఓ చేతిలో పరీక్ష ప్యాడ్, మరోచేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని పరీక్ష కేంద్రానికి వచ్చారు. ఆయన 12 వ తరగతి పరీక్షలు రాశారు.
తన జీవితంలో మంచి లాయర్ కావాలని చిన్నప్పటి నుంచి కలకనేవాడినని.. అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం జరిగిందని అన్నారు. ‘లా’ చదవాలనే పట్టుదల తనలో ఇంకా ఉందని.. అందుకోసం ఇంటర్ పరీక్షలు పూర్తిచేయాలని పరీక్షలు రాస్తున్నట్టు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బరేలీలోని బిత్రి చైన్పూర్ నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో గెలిపాచారు రాజేశ్ మిశ్రా. అప్పటి నుంచి యూపీ బీజేపీలో ఆయన క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా రాజేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మంచి లాయర్ ని వినియోగించుకోలేరు.. అలాంటి వారి తరుపు నుంచి వాదించేందుకు నేను లా చదవాలనుకుంటున్నాను.. అందుకే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను’ అని అన్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. మాజీ ఎమ్మెల్యే ఎగ్జామ్ హాల్ కి పరీక్ష అట్టా పట్టుకొని చిన్నపిల్లాడిలా రావడం అందరినీ ఆకర్షించింది.. అంతేకాదు ఆయనను ఎంతోమంది ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు నెటిజన్లు.