భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ఎంతోపేరు గడించారు ప్రతిభా పాటిల్. అలాంటి ప్రతిభా పాటిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే..!
దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త దేవిసింగ్ షెకావత్ శుక్రవారం కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో దేవిసింగ్ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కింద గుండెపోటు రావడంతో ఆయన్ను పుణెలోని కేఈఎం ఆస్పత్రిలో చేర్చారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు ఉదయం 9.30 గంటలకు దేవిసింగ్ ప్రాణాలు విడిచారు. డాక్టర్లు ఆయనకు సర్జరీ చేసినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. బీపీ పెరిగిపోవడంతో పాటు కిడ్నీలు పాడవడం తదితరాలు ఆయన మృతికి కారణాలని సమాచారం. ఇవాళ సాయంత్రం 6 గంటలకు పుణెలోని ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ కూడా రాజకీయాల్లో ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్నారు. రాజస్థాన్‌లోని అమరావతికి ఆయన తొలి మేయర్‌గా ఎంపికయ్యారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మేయర్‌గా ఎన్నికైన అమరావతి నుంచే 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేసి దేవిసింగ్ విజయం సాధించారు. అలా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. రాజకీయాలతో పాటు వ్యవసాయ రంగం, విద్యా రంగంలోనూ ఆయన సేవలు అందించారు. 1972లో ముంబై యూనివర్సిటీలో ఆయన తన పీహెచ్‌డీని పూర్తి చేశారు. విద్యా భారతి శిక్షాన్ సంస్థ ఫౌండేషన్ నడిపే కాలేజీకి ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఇక, దేవిసింగ్ మృతిపై ప్రముఖ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
पूर्व राष्ट्रपति प्रतिभा पाटिल के पति का निधन, देवी सिंह शेखावत का 89 साल की उम्र में निधन, पुणे के निजी अस्पताल में ली अंतिम सांस#PratibhaPatil #DevisinghShekhawat #FirstIndiaNews pic.twitter.com/HG8y9HZHT0
— First India News (@1stIndiaNews) February 24, 2023