ఈ మద్య చాలా మంది అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపి.. అకస్మాత్తుగా మృత్యువడిలోకి చేరుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదాలు నెలకొంటున్నాయి. గుండెపోటు మరణాలు.. ఆత్మహత్యలు, అనుకోని ప్రమాదాలు కారణాలు ఏవైనా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారుు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. అప్పటి వరకు మన మధ్యనే ఉన్నవారు అకస్మాత్తుగా మృత్యువడిలోకి చేరిపోతుంటారు. కొంతమంది అనారోగ్యంతో చనిపోతే.. కొంత మంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతుంటారు కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల మృత్యు కోరల్లో చిక్కుకుంటారు. తాజాగా తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ధర్మలింగేశ్వరర్ ఆలయం ఉత్సవాల్లో ఈ విషాదం చోటు జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
చెన్నై శివారులోని కిల్ కట్టలై వద్ద ఉన్న మూవరసం పేట ట్యాంక్ లో బుధవారం ఉదయం ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురి మృతదేహాలన వెలికితీశారు. ధర్మలింగేశ్వరర్ ఆలయంలో తీర్థవర్ధీ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎంతోమంది భక్తులు విచ్చేశారు. ఉత్సవాలకు వచ్చిన ఐదుగురు యువకులు అనుకోకుండా నీటిలో పడి గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పలవంతంగల్ పోలీసులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎట్టకేలకు నీటిలో గల్లంతైన ఐదుగురు యువకులు మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం క్రోమ్ పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతో 23 ఏళ్ల లోపు వయసు ఉన్నవారే కావడంతో అక్కడ అంతా విషాదం నెలకొంది. మృతులు మడిపాక్కంకు చెందిన రాఘవన్, యోగేశ్వరన్, వనేష్, రాఘవ్, ఆర్. సూర్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఆలయంలో ఎంతో ఆనందంగా ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో అంత శోకసంద్రంలో మునిగిపోయారు.