దీంతో శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పురుషులు పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆనందాయకమైన లైంగిక సామర్థ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, ఫిట్ నెస్ పెంచుకోవడం వంటి చర్యలు చేపడతారు. దీని కోసం వయాగ్రా వంటి ఔషధాలను స్వీకరిస్తుంటారు. అయితే దీనికోసం వెళ్లిన నలుగురు అమ్మాయిలు..
శృంగారమనేది కేవలం శరీరానినికి చెందిన కసరత్తు కాదు. మానసిక ఉత్తోజానికి తోడ్పాటునందిస్తోంది. అయితే వయస్సు, ఒత్తిడి పెరిగే కొద్దీ లైంగిక సామర్థ్యత తగ్గిపోతుంది స్త్రీ, పురుషుల్లో . దీంతో శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పురుషులు పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆనందాయకమైన లైంగిక సామర్థ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, ఫిట్ నెస్ పెంచుకోవడం వంటి చర్యలు చేపడతారు. భాగస్వామిని శృంగార పరంగా సంతృప్తి పరిచేందుకు నానా అవస్థలు పడుతుంటారు. అయితే దీని కోసం వయాగ్రా వంటి ఔషధాలను స్వీకరిస్తుంటారు. దీనికి చాలా డిమాండ్ కూడా. ఈ వయాగ్రా కోసం వెళ్లిన నలుగురు అమ్మాయిలు కనపడకుండా పోయారు.
శృంగార పరంగా అద్భుతమైన శక్తిని ఇచ్చే మూలికగా ‘హిమాలయన్ వయాగ్రా’ను నేపాలీలు భావిస్తుంటారు. శిలీంధ్రాల వంటి మూలికలను తీసుకోవడానికి వందలాది గ్రామస్థులు వేసవిలో హిమాలయాల దిగువ ప్రాంతాలకు వెళతారు. ఈ హిమాలయన్ వయగ్రా కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మంచు ప్రాంతాలకు పెద్ద యెత్తున వెళుతుంటారు. ఇలా వెళ్లిన వారిలో ఒకరు, ఇద్దరు కనిపించకుండా పోవడం అక్కడ సాధారణమే. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దార్చులా జిల్లాకు చెందిన ప్రజలు వయాగ్రా కోసం హిమాలయాలకు వెళుతూ ఉంటారు. ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఈ సారి కూడా పెద్ద యెత్తున ఈ వయాగ్రా కోసం ప్రజలకు వెళ్లారని సమాచారం. హిమాపాతం భారీన పడి ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారుల దృష్టికి వెళ్లింది.
మంగళవారం బయాస్ గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసుకున్న సమయంలో భారీ హిమపాతం ముంచెత్తగా.. ఐదుగురు కనిపించకుండా పోయారని, ఏడుగురు తప్పించుకున్నట్లు దార్చులా జిల్లా అధికారి ప్రదీప్ సింగ్ ధామి తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నారని చెప్పారు. వీరి జాడ కోసం 72 గంటల నుండి డజన్ల కొద్దీ పోలీసులు వెతుకుతున్నారని చెప్పారు. వారు కనిపించకుండా పోయిన ఈ ప్రాంతం జాతీయ రాజధాని ఖాట్మండుకు వాయువ్యంగా 500 కిమీ (312 మైళ్ళు) దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో నిరంతరంగా కురుస్తున్న మంచు, వర్షం కారణంగా తప్పిపోయిన గ్రామస్థుల అన్వేషణకు ఆటంకం ఏర్పడిందని ధామి చెప్పారు.