ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎవరూ చేయని విచిత్రమైన పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కి చెందిన క్షమా బిందు. ఈ అమ్మడు తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. భారత్ లో మొదటి సారిగా తనను తానే పెళ్లి చేసుకోవడం (సోలోగమి) ఫస్ట్ టైమ్ కావడంతో అందరి దృష్టి ఈ అమ్మడిపై పడింది. మొత్తానికి క్షమా బిందు అన్నంత పని చేసింది. తనకు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ అమ్మడు తనను తానే పెళ్లి చేసుకుంది.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఫోటో గ్రాఫర్ రాలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు!
దేశంలో ఇప్పటి వరకు ఎవరూ తీసుకోని నిర్ణయం వడోదరకు చెందిన క్షమా బిందు అనే యువతి తీసుకుంది. ఆమె వినూత్న పద్దతిలో తనను తాను (సోలోగమి) వివాహం చేసుకుంటానని ప్రకటించి వార్తల్లోకి ఎక్కింది. అప్పటి నుంచి ఆమె గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అంతేకాదు ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ ఆమె ప్రకటనపై కొంత మంది మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి అనుకున్న సమయం కంటే రెండు రోజులు ముందుగానే స్నేహితుల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా క్షమా బింధు హల్దీ, మెహందీ వేడుకలు, వేదమంత్రాలతో ఏడడుగులు కూడా వేసింది. సింధూ వర్ణ చీర కట్టి, మెడలో పూలదండ వేసుకొని..మెహందీతో తనను తాను అద్దంలో చూసుకుంటూ తెగ మురిసిపోయింది. మెడలో మంగళసూత్రం కూడా ధరించింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ పెళ్లి తంతును నిర్వహించారు. మొత్తానికి సోలోగమి వివాహంగా క్షమా బిందు రికార్డు సృష్టించింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్న తల్లికోతి.. వీడియో వైరల్