జమ్ముకశ్మీర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈమధ్యకాలంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కారణం ఏదైన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో బాలుడితో సహా దంపతులు సజీవదహనమయ్యారు. తాజాగా జమ్ము కాశ్మీర్ లో విషాదం చోటుచేసుకుంది. తోతావాలి గల్లీలో ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జమ్ము, పూంఛ్ మార్గం మధ్యలో భారత్ ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆ వాహనం నుంచి మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే ఆ వాహనం అంతా అగ్నిఖిలల్లో చిక్కుకు పోయింది. చూస్తుండగానే వాహనం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయ్యారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
భట్టా దురియన్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏదైనా విధ్వంసం జరిగిందా..? మరేదైనా కారణమా అని తెలియాల్సి ఉంది. ఆర్మీ అధికారులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Indian Army truck catches fire in #Poonch district of Jammu & Kashmir pic.twitter.com/Eg75UdE875
— Swamy (@SwamyJourno) April 20, 2023