తమిళనాడులో భారీ ప్రమాదం తప్పింది. కోయంబత్తూరు నుండి బెంగళూరుకు వెళ్తున్నఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి 1 గంటకు సేలం జిల్లా మెట్టూరు వద్దకు రాగానే బస్సు ముందు భాగం నుండి మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును నిలిపివేసి.. ప్రయాణీకులను అలర్ట్ చేశారు. ఆ సమయంలో మొత్తం బస్సులో 44 మంది ప్రయాణీకులున్నారు.
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఆందోళన గురయ్యారు. బస్సు దిగే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. కాగా, ఈ మంటలు రావడాన్ని చూసిన స్థానికులు కారుమలై కూడల్ అగ్నిమపాక సిబ్బంది సమాచారం అందించారు. సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ బస్సు పూర్తిగా దగ్దమైంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుప్రతికి తరలించారు.
— Hardin (@hardintessa143) January 30, 2023