ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మన ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకుంటూనే ఉంటాం. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల్లో ఎంతో కలుషితం దాగి ఉన్నా.. తప్పని సరి పరిస్థితితో తీసుకోక తప్పడం లేదు. కానీ కొంత మంది కేటుగాళ్లు తాము డబ్బు సంపాదించడం కోసం ఎదుటి వారి ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆహార పదార్ధాలు, మంచి నీరు, తాగే పాలు ప్రతిదాన్ని కలుషితం చేస్తున్నారు.
ఆరోగ్యానికి మంచి ఆహార పదార్థాలు ఆకు కూరలు, కూరగాయలు అంటారు. అలాంటి కూరగాయాలు.. ఆకు కూరలు కూడా కలుషితం అవుతున్నాయి. తాజాగా కూరగాయల వ్యాపారి మాత్రం నిర్లక్ష్యం వహించాడు. తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను డ్రైనేజీ వాటర్‌లో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. ఈ తతంగం కెమెరా కంటపడింది. వెంటనే దాన్ని కెమెరాలో షూట్ చేసి వైరల్ చేశాడు. దాంతో ఆ కూరగాయల వ్యాపారిపై కేసు నమోదైంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలు చోట్ల జరిగాయి.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగు చూసింది. కాగా, కొత్తిమీరను మురుగునీటిలో శుభ్రపరిచిన వీడియోలు భోపాల్ కలెక్టర్ కి చేరడంతో ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ఈ వీడియోన కలెక్టర్ అవినాష్ లవనియా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి.. చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి పోలీసులు కూరగాయల వ్యాపారి ధర్మేంద్ర ఫోన్ నంబర్ కనిపెట్టినప్పటికీ.. అది స్వచ్ ఆఫ్ వస్తుంది.. త్వరలో ధర్మేంద్రను పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.
कलेक्टर भोपाल @AvinashLavania ने लिया संज्ञान , संबंधित अधिकारियों को दिए सख्त कार्यवाई के निर्देश@digpolicebhopal @BMCBhopal #JansamparkBhopal https://t.co/KtrUonmW5z
— Collector Bhopal (@CollectorBhopal) October 26, 2021