ఇటీవల తరచూ దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానయాన శాఖ అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు బలవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ ఇంటిపై యుద్ధ విమనం కుప్ప కూలింది.
ఇటీవల తరచూ దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానయాన శాఖ అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక సమస్యలు ఇబ్బందులు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో 72 మంది సజీవ దహనమయ్యారు. అలానే ఇటీవలే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హెలికాప్టర్లు కుప్పకూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మరణించారు. తాజాగా రాజస్థాన్ లో మరో యుద్ధ విమానం కూలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రంలో ఫైటర్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరు మృతి చెందారు. రాజస్థాన్ లోని హనుమాఘర్ ప్రాంతంలోని ఓ ఇంటిపై మిగ్-21 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఉన్న ఇద్దరు పౌరులు మృతి చెందారు. అలానే ఈ ప్రమాదం నుంచి ఫైలెట్ ప్రాణాలతో బయట పడ్డాడు. రోజూ లాగానే సోమవారం కూడా శిక్షణలో భాగంగా హనుమాఘర్ ప్రాంతంలో మిగ్-21 యుద్ధ విమానం తిరుగుతుంది. సూరత్ ఘర్ ప్రాంతంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి టెకాప్ అయినా మిగ్-21.. హనుమఘర్ ప్రాంతంలో కూడా చక్కర్లు కొట్టింది
ఈ క్రమంలో అకస్మాత్తుగా స్థానికంగా ఉండే ఓ ఇంటిపై ఈ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఫైలెట్ స్వల్ప గాయలతో బయట పడ్డాడు. ఈఘటన గురించి సమాచారం అందుకున్న రక్షణ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి.. ఇలా తరచూ ఇలా యుద్ధ విమానాలు కూలిపోవడంపై అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A MiG-21 aircraft of the IAF crashed near Suratgarh during a routine training sortie today morning. The pilot ejected safely, sustaining minor injuries.
An inquiry has been constituted to ascertain the cause of the accident.— Indian Air Force (@IAF_MCC) May 8, 2023