'రెండు మగ చీతాలతో ఆడ చీతా శృంగారం..' వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. జూ అధికారులే అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. కాకుంటే ఆ సమయంలో మగ చీతాలు రెచ్చిపోవడంతో గాయాల పాలై ఆడ చీతా కన్ను మూసింది.
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా గతేడాది నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో మరొకటి మృతి చెందింది. మంగళవారం దక్ష అనే ఆడ చీతా కన్ను మూసింది. దీంతో మరణించిన చీతాల సంఖ్య మూడుకు చేరింది. రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడిన దక్ష కొద్ది గంటల్లోనే మృతి చెందిందని, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చౌహాన్ ప్రకటన చేశారు. తాము గాయపడిన ఆడ చీతాకు అవసరమైన చికిత్స తక్షణమే అందించామని, కానీ అది ఫలించలేదని చౌహాన్ తెలిపారు. ఆడ చీతాతో సంభోగ సమయంలో వాయు, అగ్ని అను మగ చీతాలు పరస్పరం దాడులు చేసుకున్నాయని, ఆ సమయంలో అయిన గాయాల వల్లే దక్ష మరణించిందని ఆయన వెల్లడించారు.
చీతాల సంఖ్యను పెంచటం, దక్ష సంభోగం గురుంచి వన్యప్రాణి అధికారులు, నిపుణులు ఏప్రిల్ 30న ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్ష అని ఆడ చీతాను వాయు, అగ్ని అను రెండు మగ చీతాలతో కలిసేలా చూడాలని నిర్ణయించారు. ఆ ప్రకటన ప్రకారం మే 6న ఎన్‌క్లోజర్ నెంబర్ 1లో ఉన్న దక్షను బోమా 7 ఎన్‌క్లోజర్‌లో ఉన్న వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఆడ చీతాకు గాయాలైనట్లు స్పష్టమవుతోంది. ఇది చాలా సాధారణ విషయమని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చౌహాన్ చెబుతున్నారు.
A female cheetah, Daksha, brought from South Africa and placed in Madhya Pradesh’s Kuno National Park, was killed in a fight with other cheetahs inside the park. According to sources, Daksha died in a “violent interaction” with the Phinda adult male coalition, which included Vayu… pic.twitter.com/kZX1l7a7zc
— The Tatva (@thetatvaindia) May 10, 2023
మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని చౌహన్ తెలిపారు. “సంభోగం సమయంలో మగ చీతాలు ఆడ చీతాలతో మొరటుగా ప్రవర్తించడం సాధారణం. ఆ సమయంలో పర్యవేక్షక బృందం జోక్యం చేసుకోవడం అసాధ్యం” అని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ వెల్లడించారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీటిలో 5 ఆడవివి కాగా, 3 మగ చిరుతలు ఉన్నాయి. కొన్ని రోజుల పర్యవేక్షణ అనంతరం వీటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
📍 Madhya Pradesh | Third cheetah, relocated from Namibia in South Africa, dies in #KunoNationalPark.
Female cheetah #Daksha succumbed to injury, caused during a violent interaction with one of the male cheetahs.
This is 3rd #Cheetah death in 3 months. Only 17 cheetahs are… pic.twitter.com/izyllDfC9w
— Mirror Now (@MirrorNow) May 9, 2023