కన్న కూతురిని ఎవరైన ఏడిపిస్తే తండ్రి కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ అదే తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడితే సమాజం ఏటు పోతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ ఇక్కడ అదే జరిగింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జలార్ జిల్లాలోని ఓ కిరాతక తండ్రి కసాయిగా మారి కన్న కూతురిపై అత్యాచారానికి దిగాడు.
ఇక ఇందులో తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ప్రతీ రోజు తన కూతురిని లైంగికంగా వేదించటం, అత్యాచారానికి ఒడిగట్టడం వంటి దారుణానికి దిగాడీ దుర్మార్గపు తండ్రి. ఇదే విషయాన్ని తల్లి ముందు కూతురు ఆవేదనతో ఎంత విన్నవించినా.. కనికరించకుండా తిరిగి తననే తిట్టేదని తెలుస్తోంది. ఇక విషయాన్ని
32 నిమిషాలున్న ఆ ఆడియోని భద్రపరిచిన ఆ యువతి తన అత్తకు పంపింది.
దీంతో మెల్ల మెల్లగా ఆ ఆడియో సోషల్ మీడియాలోకి చేరి కాస్త వైరల్ గా మారింది. ఈ దారుణ విషయాన్ని తెలుసుకున్న ఆ తండ్రి కుమారుడు తట్టుకోలేక పోయాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు స్థానిక నీటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇక కన్న తండ్రి కూతురిపై చేసిన ఇలాంటి దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.