చాలా మంది వజ్రాలు దొరుకుతాయని భూమిని లీజుకి తీసుకుని మరీ మైనింగ్ చేస్తుంటారు. కేవలం అదృష్టాన్ని నమ్మి ముందుకు వెళ్తుంటారు. ఏళ్ల తరబడి తవ్వినా గానీ అక్కడ ఏమీ దొరకదు. కానీ కొంతమందికి మాత్రం తలపెట్టిన కార్య బలమో ఏమో గానీ కార్యఫలం సిద్ధిస్తుంది. అదేంటో నడుస్తుంటే కాళ్ళకి వజ్రాలు తగులుతుంటాయి. మాట్లాడితే ముత్యాలు రాలుతున్నాయని అన్నట్టు.. కొంతమందికి అదృష్టం ఉంటే పైపైనే వజ్రాలు తేలుతుంటాయి. మధ్యప్రదేశ్ లోని ఓ మైనింగ్ ప్రాంతంలో అదే జరిగింది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో రత్నగర్భ మైన్స్ లో లో విలువైన వజ్రాలు, రత్నాలు దొరుకుతాయని చాలా మంది నమ్ముతారు. ఇప్పటికే అక్కడ దొరికిన వజ్రాల వల్ల కొంతమంది లాభం పొందారు.
ఈ మైనింగ్ లో దొరికే ఈ వజ్రాల కోసం ప్రపంచదేశాల నుండి అనేక మంది ఇక్కడికి వస్తారు. కానీ వారికి దొరికే గనులు అన్నీ వారిని ధనవంతులని చేయవు. కేవలం కొంతమందికి దొరికే అరుదైన వజ్రాల వల్లే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. బంగారం మెరుస్తుంది, అలా అని మెరిసేదంతా బంగారం కాదని అంటారుగా. అలానే ఈ రత్నాలు కూడా. దొరికింది వజ్రంలానే అనిపిస్తుంది కానీ పరీక్షిస్తే తెలుస్తుంది, అది వజ్రమో కాదో అని. చాలా మంది వజ్రాల కోసం ప్రయాసపడతయారు. కానీ చివరికి కొంతమందికే నికార్సైన వజ్రాలు దొరుకుతాయి. ఆ కొంతమంది మాత్రమే ధనవంతులవుతారు. అలా రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు నలుగురు రైతులు.
కొన్ని రోజుల క్రితం పన్నాలోని రత్నగర్భ మైనింగ్ ల్యాండ్ ని నలుగురు రైతులు లీజుకి తీసుకున్నారు. రోజుల తరబడి వజ్రాల వేట కొనసాగించారు. గురువారం నాడు నలుగురు రైతులు వజ్రాల కోసం మైనింగ్ చేస్తుండగా.. నేల మీద వజ్రాలు దొరికాయి. ముగ్గురు రైతులకు అత్యంత ప్రకాశవంతమైన వజ్రాలు దొరకగా, ఒక రైతుకి మాత్రం సాధారణ వజ్రం దొరికింది. నలుగురూ తమకి దొరికిన వజ్రాలను డైమండ్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. ఓం ప్రకాష్ అనే రైతుకి 3.96 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని ఖరీదు 15 నుండి 20 లక్షలు ఉంటుందని డైమండ్ అధికారులు వెల్లడించారు. ఇక రెండో రైతు రాజేంద్ర కుమార్ గుప్తకి 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని ఖరీదు 15 లక్షలు ఉండచ్చునని అంచనా వేశారు. పున్నా అహిర్వార్ అనే రైతుకి దొరికిన 1.10 క్యారెట్ల వజ్రం కూడా లక్షలు విలువ చేస్తుందని తెలిపారు.
ఇక నీరు పాల్ అనే రైతుకి 1.30 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని ఖరీదు లక్షల్లో ఉంటుందని తెలిపారు. దీంతో రాత్రికి రాత్రే రైతులు లక్షాధికారులు అయిపోయారు. త్వరలోనే వేలంలో పెట్టి రైతులకి డబ్బులు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే వేలంలో వారు చెప్పిన ఖరీదు కంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఎలా అయినా గానీ ట్యాక్సీలు, మీక్సీలు పోనూ ఒక్కో ఆ రైతులకి కనీసం 15 నుండి 10 లక్షలైనా రాకుండా ఉంటుందా? చేతికి ఎంత వచ్చినా గానీ ఆ డబ్బుకి తగ్గా వ్యాపారం చేసుకుని బతుకుతామని అంటున్నారు రైతులు. తమకి వజ్రాలు దొరికినందుకు రైతులు సంతోషిస్తున్నారు. మరి రాత్రికి రాత్రే ధనవంతులైపోయిన రైతులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Madhya Pradesh News: पन्ना में एक साथ चार लोगों को अलग-अलग खदानों में मिले बेशकीमती हीरे#siamond #mpnews #pannanewshttps://t.co/2QnRAKyMeZ pic.twitter.com/HuPYudd62j
— NaiDunia (@Nai_Dunia) September 22, 2022