మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే జరుగుతూ ఉంటుంది. జల్సాల కోసం, సులభంగా డబ్బు సంపాదించాలని కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. కానీ అక్కడ ఈ మోసాలకు భిన్నంగా అవయవాల చోరీకి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటనతో నివ్వెర పోయిన మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే జరుగుతూ ఉంటుంది. జల్సాల కోసం, సులభంగా డబ్బు సంపాదించాలని కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. కానీ అక్కడ ఈ మోసాలకు భిన్నంగా అవయవాల చోరీకి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటనతో నివ్వెర పోయిన మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
ప్రాణాలను కాపాడే వైద్యులను దైవంతో సమానంగా చూస్తాము. కొంత మంది వైద్యులు మాత్రం వారి స్వార్ధ ప్రయోజనాల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. ఓ మహిళ వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే తన కిడ్నీలను కాజేసిన ఉదంతం ఒకటి బిహార్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ పలోని ముజఫర్ పూర్ లో గల మధురాపూర్ గ్రామానికి చెందిన పేద దళిత మహిళ సునీత కడుపునొప్పితో బాధపడుతుండేది. పోనుపోను ఆ నొప్పి తీవ్రమవ్వడంతో స్థానికంగా ఉన్న శుభ్ కాంత్ క్లినిక్ కు వెళ్లింది. అయితే ఈ క్లినిక్ ను వైద్యుడిగా చెప్పుకుంటూ పవన్ కుమార్ అనే కాంపౌండర్ నిర్వహిస్తున్నాడు. కడుపు నొప్పితో వచ్చిన ఈ మహిళకు పవన్ కుమార్ తో పాటు జితేంద్ర కుమార్ పాశ్వాన్, ఆర్కే సింగ్ అనే వైద్యులు, పవన్ కుమార్ భార్య కలిసి ఆపరేషన్ చేశారు.
ఆ మహిళ నుంచి రెండు కిడ్నీలను కాజేశారు. ఆ ఆపరేషన్ కు గాను ఆమె వద్ద నుంచి రూ. 20వేలు తీసుకున్నారు. ఆ తరువాత ఆమెను మెరుగైన వైద్యం కోసమని చెప్పి పట్నాలోని మరొక ఆసుపత్రికి తరలించి పరారయ్యారు. అక్కడ ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పట్నాలోని మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాధిత మహిళ సునీత రెండు కిడ్నీలు లేవని గుర్తించారు. సునీత ప్రభుత్వ సాయంతో డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్నది. దీంతో సునీత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా బాధిత మహిళ నిందితుడి కిడ్నీని తనకు ఇచ్చి ప్రాణాలను కాపాడాలని కోరుతుంది.