విద్యార్ధులకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవకాశలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వర్గాల విద్యార్ధులకు స్కాలర్ షిప్ ఇస్తూ ఆర్ధిక భరోసాను ఇస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పలు కార్పొరేట్ కంపెనీలు, ఇతర పెద్ద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులకు చేయుతనిస్తున్నాయి. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఓ శుభవార్త వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఓ గోల్డెన్ ఛాన్స్. అది ఏమిటంటే.. ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఏడాదికి రూ.75,000 లభిస్తాయి. మరి.. అవి ఎలా పొందాలి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ఇండస్ట్రియల్, ఆటోమోటీవ్ సప్లయర్ కంపెనీ ‘షాఫ్లర్ ఇండియా’.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. ఆ విద్యార్ధుల కోసం ‘హోప్ ఇంజనీరింగ్ స్కాలర్ షిప్’ అనే ప్రోగ్రామ్ ను ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఏడాదికి రూ.75 వేలు వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తుకి ఆహ్వానించింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12న నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.
అయితే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర విద్యార్ధులకు ఈ స్కాలర్ షిప్ అందుబాటులో ఉంటుంది. దీనిని ‘బడ్డి4స్టడీ’ అమలు చేస్తోంది. అయితే ఈ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకునే వాళ్ల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. షాఫ్లర్ ఇండియా లేదా బడ్డి4 స్టడీ సంస్థల ఉద్యోగులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు కాదు. అభ్యర్ధులు 2021-22 అకడమిక్ సైన్స్ విభాగంలో 12వ తరగతిలో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో ఇంజనీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతుండాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, మెటలర్జీ, ఐటీ, మెకానికల్, ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల విద్యార్ధులకు ప్రాధాన్యత ఇస్తారు.
కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:
పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, కుటుంబ ఆదాయపత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, 10వ తరగతి మార్కుల పత్రం, 12వ తరగతి మార్కుల షీట్, అడ్మిషన్ లెటర్ . ఇటీవల కాలేజీలో చెల్లించిన ఫీజుకు సంబంధించిన రసీదు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం సృష్టించబడిన Buddy4Study అధికారిక వెబ్‌సైట్‌లోని ‘అప్లయ్ నౌ’ బటన్‌పై క్లిక్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి ‘స్టార్ట్ అప్లికేషన్’ పై క్లిక్ చేయాలి. అందులో అవరసమైన వివరాలను ఫిల్ చేయాలి. ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. టర్మ్స్, కండీషన్స్ పై ఓకే చేయాలి. చివరగా ప్రివ్యూపై క్లిక్ చేసి.. ఓసారి అన్ని వివరాలు చెక్ చేసుకోవాలి. చివరగా ‘సబ్మిట్’ బటన్ పై నొక్కాలి.
ఎంపిక:
ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో పూర్తి చేసిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్ధుల షార్ట్‌లిస్ట్ తయారుచేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఫైనల్ సెలక్షన్‌లో 10-15 నిమిషాలు పాటు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులో ఎంపికైన విద్యార్ధులకు ఏడాది రూ.75 వేల స్కాలర్ షిప్ అందజేస్తుంటారు. మరి.. ఈ స్కాలర్ షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.