PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామంటూ ఓ అగంతకుడు సెంట్రల్ ఏజెన్సీకి బెదిరింపు మెయిల్‌ను పంపాడు. ఆ మెయిల్‌లో తన వద్ద 20 కేజీల ఆర్‌డీఎక్స్ ఉందని అతడు పేర్కొన్నాడు. అంతేకాదు! మోదీని చంపటం కోసం 20 మంది స్లీపింగ్ సెల్స్ రెడీగా ఉన్నారని, వారు ఈ హత్యలో భాగం కానున్నారని వెల్లడించాడు. 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను 20 చోట్ల 20 దాడులు చేయటానికి ఉంచినట్లు తెలిపాడు. తమ లక్ష్యం పీఎం మోదీని చంపటమేనని అగంతకుడు తన మెయిల్‌లో స్పష్టం చేశాడు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీ అధికారులు అప్రమత్తం అయ్యారు. మెయిల్ పంపిన వ్యక్తి అడ్రస్ కనుక్కోవటానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : పై కోర్టులోనూ అదే తీర్పు.. అనందంలో భర్త.. షాక్‌లో భార్య..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.