ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకా కొనుగోలు, యాజమాన్యం మార్పు ప్రక్రియలు పూర్తి కాలేదు. ఈలోపే ట్విట్టర్ లో తీసుకోరాబోతున్న పెను మార్పులను అడపాదడపా మస్క్ ప్రస్తావిస్తూనే ఉన్నాడు. వాటిలో భాగంగా ట్విట్టర్ ఖాతాను జీవితకాలం బ్యాన్ చేయడంపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ లో ట్వీట్లు తొలగించడం, జీవితకాలం బ్యాన్ చేయడం సరైన నిర్ణయం కాదంటూ వ్యాఖ్యానించాడు. అదే విషయంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు డోర్సే సైతం తన వ్యాఖ్యలను సమర్థించినట్లు తెలియజేశాడు. ఇంక కొనుగోలు ప్రక్రియ పూర్తవగానే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తామంటూ ప్రకటన చేశారు.
ఇదీ చదవండి: నేను చనిపోవచ్చు. వైరల్ అవుతన్న ఎలాన్ మస్క్ ట్వీట్!
2021లో క్యాపిటల్ హిల్ పై దాడి తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై జీవితకాల బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ట్విట్టర్ కు పోటీగా ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకొచ్చారు. 2022 ఏడాది ప్రారంభంలో ట్రూత్ సోషల్ అంటూ ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ట్రంప్ ప్రారంభించారు. ఒకవేళ ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినా కూడా తనకి చేరే ఉద్దేశం లేదంటూ ట్రంప్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. తన ట్రూత్ సోషల్ పై దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఎలాన్ మస్క్ పై ప్రశంల వర్షం కురిపించారు. మస్క్ ఎంతో మంచివాడని కొనియాడారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను మెరుగు పరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ఖాతా పునరుద్ధరణ చేస్తాననడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.