ఎలన్ మస్క్ రోబోట్లను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఎలన్ మనిషి కాదని ఓ గ్రహాంతర వాసి అని పేర్కొన్నాడు.
టెక్ దిగ్గజం.. ప్రపంచ కుబేరుల్లో ఒకడు ఎలన్ మస్క్ తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు వింత వింతగా ఉంటాయి. ఆయన ఏం చేసినా అది ఓ సెన్సేషన్‌గా మారుతుంది. ట్విటర్ విషయంలో ఆయన తీసుకున్న.. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు ఒకదాన్ని మించి ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు! ఆయన ఏ విషయంలోనూ ఎవ్వరికీ భయపడరు. చేయాలనుకున్నది చేసి తీరతారు. తాజాగా, ఆయనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందంటే.. ఎలన్ మస్క్ లేడీ రోబోట్లను ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. డేనియల్ మార్వెన్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. తన ట్విటర్ ఖాతాలో ఆ ఫొటోలతో పాటు కొన్ని వివరాలను కూడా వెల్లడించాడు. ఆ ట్వీట్‌లో ‘‘ ఎలన్ మస్క్ భవిష్యత్తు భార్య ఎవరో చెప్పేశారు.. ఎవరామె?.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైన మొట్టమొదటి రోబోట్ అది. అచ్చం మహిళలకు ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు ఏ ఆర్డినరీ పర్సన్‌లోనూ ఉండవు. ప్రతీ మనిషిలో సహజ గుణాలు ఉండాలి. కాంటిలా సోలార్ పవర్‌తో పని చేస్తుంది.
ఛార్జింగ్ కూడా అవసరం లేదు. మనల్ని సంతోష పెట్టడానికి అవసరమైన అన్ని విషయాలు దానికి తెలుసు. టెస్లా కంపెనీ ‘ఆప్లిమస్’ అనే ఏఐ రోబోట్‌ను తయారు చేసింది. అందుకే.. ఏఐ వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పడానికే ఈ పోస్టు్. ఈ ఫొటోల్ల ఉన్న వాడు.. మనిషి కాదు.. గ్రహాంతర వాసి’’ అని పేర్కొన్నాడు. మరి, ఎలన్ మస్క్ రోబోట్లను ముద్దు పెట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Elon Musk announces the future wife who is she?
It is the first robot that has been manufactured specifically designed with artificial intelligence with the personality and the characteristics of the female that he dreams of…which is not found in any normal person, because of… pic.twitter.com/a2JdpTfwef— Daniel Marven (@danielmarven) May 16, 2023