ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు అభ్యర్ధులు ఎంతగానో కష్టపడతారు. అయితే ఇలా ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసి గెలుపొంది.. సేవ చేసే వారు ఎందరో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన అభ్యర్థికి ఓటర్లు అదిరిపోయే బహుమతి ఇస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు అభ్యర్ధులు ఎంతగానో కష్టపడతారు. అయితే ఇలా ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసి గెలుపొంది.. సేవ చేసే వారు ఎందరో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఎన్నికల సమయంలో అభ్యర్ధులు మరణిస్తుంటారు. అలా అకస్మికంగా మృతి చెందిన అభ్యర్ధుల్లో కొందరిని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంతో మరణించిన మహిళ అభ్యర్థికి స్థానిక ప్రజలు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హసన్ పూర్ మున్సిపాలిటీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. హసన్ పూర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభ్యర్ధులు నామినేషన్లు వేసి.. జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలానే 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధిగా అసియా అనే మహిళ బరిలోకి దిగింది. అలానే 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్ ను దాఖలు చేసింది. ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అసియా అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె ఆమె ఆస్పత్రిలో చేరి చాలా రోజుల పాటు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది.
ఇక ఆమె నామినేషన్ తిరష్కరించే గడువు ముగియడంతో.. పోటీ అనివార్యంగా మారింది. అసియా మృతి చెందిన విషయం తెలిసి కూడా ఆమెకు ఓటర్లు పట్టం కట్టారు. భారీ మెజార్టీతో ఘన విజయాన్ని స్థానిక వార్డు ఓటర్లు అందించారు. అసియాపై ప్రజలు చూపిన ఆప్యాయతను తలచుకుని ఆమె భర్త ఎమోషనలయ్యారు. అయితే అసియా మృతితో తిరిగి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. త్వరలో మరోసారి నోటిఫికేషన్ జారీ చేసి.. ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.మరి.. ఇలా ప్రజాదరణ పొందిన ఓ యువనేత మృతికి మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.