గత కొన్ని రోజులుగా దేశంలో సామాన్యులు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా వంట నూన ధరలు ఇటీవల కాలంలో అమాంతం పెరిగిపోయాయి. వంటకాల్లో వాడే నూనె ధరలు పెరిగిపోవడంతో మిడిల్ క్లాస్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనె ధరలు తగ్గాయి. దీంతో దేశంలో వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే..
తగ్గిన ధరల ప్రకారం చూస్తే.. లీటరుపై రూ.15లు వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తగ్గే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో నూనె ధరలు తగ్గడంతో మరో 2 వారాల్లో హూల్ సేల్ మార్కెట్లలో కూడా దీని ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో నూనె ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.
మన దేశంలో వినియోగించే వంట నూనె ఎక్కువ శాతం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గడంతో ఇక్కడ కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది సామాన్యులకు కాస్త ఊరట అనే చెప్పొచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.