పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఝలక్ ఇచ్చింది. నీరవ్‌మోదీకి సంబంధించిన కంపెనీల రత్నాలు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు సహా రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు, దీంతోపాటు చైనాలోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం వాటిని తాత్కాలికంగా జప్తు చేశారు.
నీరవ్ మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఆయన వ్యాపారం ముసుగులో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు. అయితే నీరవ్ మోదీ కి చెందిన హాంకాంగ్ లో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంచినట్లుట్లు తెలుసుకున్న అధికారులు.. ఆయనకు సంబంధించిన కొన్ని అభరణాలు, రత్నాలను గుర్తించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ.13,500 కోట్లకు వరకు ఎగనామం పెట్టారు. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం ఈడి దర్యాప్తు చేస్తుంది. నీరవ్ మోదీపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 420, 467, 471, 120-బీ కింద చర్యలు తీసుకున్నామని ఈడీ అధికారులు వివరించారు. ఈ కేసు దర్యాప్తు మొదలయ్యే ముందే నీరవ్ మోదీ దేశం విడిచి పరారయ్యారు. ఇక నీరవ్ ప్రస్తుతం బ్రిటన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.