కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు చాలా కట్టుదిట్టంగా తనిఖీలు చేసి.. భారీగా నగదు, డ్రగ్స్, మద్యం పట్టుకున్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలానే మద్యం, డబ్బు, చీరలు ప్రజలకు ఎరగా చూపారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు చాలా కట్టుదిట్టంగా తనిఖీలు చేసి నగదు, డ్రగ్స్ మద్యం పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించి రూ.375 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ప్రెషర్ కుక్కర్స్ స్వాధీనం చేసుకున్నారు. గతేడాది కంటే ఈసారి 4.5 రెట్లు ఎక్కువగా స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.
కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెంచామని ఎన్నికల అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. కోలారు, బీదర్ జిల్లాల్లో 100 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కలబురగి, చిక్కమగళూరు, కుణిగల్ ఇంకా ఇతర నియోజకవర్గాల్లో ప్రెషర్ కుక్కర్లు, చీరలు పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి అభ్యర్థులపై అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలకు అడ్డుకట్టవేశామని అధికారులు అంటున్నారు.
అలానే ప్రశాంతగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడాదికన్న ఈసారి మద్యం ఏరులైపారిందని, డబ్బులు కూడా జోరుగా ప్రజలకు పంచారని తెలిపారు. చాలా వరకు కట్టుదిట్టం చేశామని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. అందుకే గతేడాది కంటే 4.5 రెట్లు ఎక్కువగా డబ్బు, మద్యం వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరి.. కర్నాటకలో పట్టుబడిన ఈ భారీ నగదుపై, ఎన్నికల పనితీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.