ఇటీవల దేశంలో పలు చోట్ల భూకంపాలు రావడంతో జనాలు భయంతో వణికిపోతున్నారు. ఈ మద్య నేపాల్ లో వచ్చిన భూకంపం ఎఫెక్ట్ మన దేశ రాజధానితో పాటు హిమాలయాల్లో భూమి కంపించింది. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో భూకంపం సంబవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 5 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో వణికిపోయారు.
శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో చాలా మంది ఇళ్లు, షాపులు, ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. అటు రిషికేశ్ లో కూడా పలు చోట్లు స్వల్ప భూకంపం వచ్చింది. ఇటీవల నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం రావడంతో ఆరుగురు మృతి చెందారు.. అలాగే ఆస్తినష్టం కూడా వచ్చి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. నోయిడా, గురుగ్రామ్ లో సైతం పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి.
Earthquake tremors felt across Delhi pic.twitter.com/rnZ4Pov0dk
— ANI (@ANI) November 12, 2022