ఈ మద్య వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది టర్కీ, సిరియాలో జరిగిన భూకం ప్రళయానికి 50 మంది బలి అయ్యారు. అప్పటి నుంచి భూ కంపం అనే పేరు వినిపిస్తే చాలు వెన్నుల్లో వణుకు పుడుతుంది. భారత్ లో కూడా ఈ మద్య వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వరుస భూకంపాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది.. కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. మనిషి తాను చేస్తున్న ఎన్నో తప్పిదాల వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత కొంత కాలంగా భారత్, అఫ్గానిస్థాన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. ఈ రోజు జపాన్ లో భూకంపం సంభవించింది.. తాజాగాభారత్ లో మరోసారి భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
రెండు రోజుల క్రితం ఢిల్లీ, హర్యాన పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవిచింది. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.0 గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోటజీ తెలిపింది. గ్వాలియర్ కి 28 కిలోమీటర్ల దూరంలో భూకపం కేంద్రం ఉన్నట్లు ఎన్ సీఎస్ తెలిపింది. భూకంప అంతర్భాగంలో సుమారు పది కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చినట్లు పేర్కొంది. చత్తీస్ గఢ్ లో కూడా భూకంపం సంభవించింది. చత్తీస్ గఢ్ లోని అంభికాపూర్ లోని 3.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ తెలిపింది. సుమారు ఆరు సెకన్ల పాటు భూమి కంపించినట్లు ఎన్ సీఎస్ తెలిపింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు అధికారు తెలిపారు.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit 28km SE of Gwalior, Madhya Pradesh today at 10:31 am IST: National Centre for Seismology pic.twitter.com/FvXdeqwrZl
— ANI (@ANI) March 24, 2023