ప్రపంచాన్ని ఇప్పుడు భూకంపాలు వెంటాడుతున్నాయి.. ప్రకృతి మనిషిపై పగబట్టిందా అన్న తీరులో వరుస భూకంపాలు మనిషికి కంటిమీ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది అతి పెద్ద భూకంప టర్కీ, సిరియాలో సంభవించింది.. ఈ భూకంప ధాటికి 50 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఈ మద్య కాలంలో ప్రపంచ దేశాల్లో వరుస భూకంపాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప ప్రళయం.. మనిషిపై ప్రకృతి ఇంత పగబట్టిందా అన్న విధంగా కనిపిస్తుంది. ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.. వేల సంఖ్యల్లో వికలాంగులుగా మారారు.. కోట్ల నష్టం వాటిల్లింది. ఇక భారత్, నేపాల్, ఇండోనేషియా, జపాన్ మరికొన్ని దేశాల్లో వరుసగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది.
ఇటీవల ఉత్తరాదిన భూకంపాలు భయాందోళన సృష్టింటే.. ఇప్పుడు దక్షిణాదిన అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.0 గా నమోదు కాగా.. రాజధాని పోర్ట్ బ్లెయిర్ కి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అంతేకాదు నేపాల్ రాజధాని ఖట్మండ్ లో కూడా భూపంకం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.5 గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో నేపల్ దేశంలో పలుమార్లు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.
గత నేల భారత్ లో దేశ రాజధాని ఢిల్లీ, హర్యారా, అంబికాపూర్, చత్తీస్ గఢ్ మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవిచింది. భూకంపాలు సంభవించిన సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.. భూమి కంపిస్తున్న సమయంలో ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల భారత్ లో వచ్చిన భూకంపాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని అధికారులు అంటున్నారు.
Earthquake of Magnitude:3.5, Occurred on 01-04-2023, 03:04:30 IST, Lat: 27.78 & Long: 85.25, Depth: 25 Km ,Location: 10km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/yLKqIWmTtG @ndmaindia @Indiametdept pic.twitter.com/REtikAqdYU
— National Center for Seismology (@NCS_Earthquake) March 31, 2023