కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమి ఉండదు. అలానే అంగవైకల్యం కూడా అడ్డంకి కానే కాదు. ఈ మాటలను నిజం చేస్తూ ఎందరో విజయ తీరాలకు చేరారు. తాజాగా ఓ యువతి కూడా జీవితంలో విజయం సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. 3 అడుగుల ఎత్తు ఉన్న ఈ అమ్మాయి సాధించిన విజయం తెలిస్తే హ్యాట్సాఫ్ అనక మానరు.
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమి ఉండదు. అలానే అంగవైకల్యం కూడా అడ్డంకి కానే కాదు. ఈ మాటలను నిజం చేస్తూ ఎందరో విజయ తీరాలకు చేరారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న వారు.. తమ లోపానికి కుంగిపోకుండా.. పడి లేచిన కెరటాల్లా నిలుస్తున్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారే చిన్న అపజయం ఎదురు కాగానే మానసికంగా కుంగిపోతుంటారు. అలాంటి వారు ఓ యువతి ఆదర్శంగా తీసుకోవాలి. తన వైకల్యాన్ని అధికమించి.. ఆ యువతి కుటుంబానికి కుమారుడిగా మారింది. అందరికి ఆదర్శంగా నిలిచిన ఆ యువతి లైఫ్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహారాష్ట్ర జిల్లాలో నాసిక్ చెందిన పూజ ఘోడ్ కే తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది. పూజ పుట్టడమే మరగుజ్జు కావడంతో ఆమె తల్లి చాలా బాధపడింది. తన బిడ్డకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆ తల్లి ఆరాపడేది. అందుకే పూజ ఎత్తును పెంచేందుకు ఆమె తల్లి అనేక ఆస్పత్రుల చుట్టు తిరిగింది. బిడ్డ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. నీ బిడ్డ ఎత్తు పెరగదని డాక్టర్లు చెప్పడంతో పూజ తల్లి ఆవేదనకు గురైంది. అలానే చిన్నప్పుడు పూజ బస్సు ఎక్కలేక పడిపోయింది. దీంతో ఆమె చదువు ఎలాగని తల్లికి ఆందోళన కలిగింది.
మరుగుజ్జు కావడం వల్ల చిన్నప్పటి నుంచి పూజ అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంది. పూజా కూడా తన వైకల్యం చూసి బాధపడింది. ఆ తరువాత జీవితంలో ఎదిగేందుకు ఈ వైకల్యం అడ్డం కాదని భావించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైకల్యాన్ని జయించి.. పట్టుదలతో చదివి.. ఎం.కామ్ పూర్తి చేసింది. అదే ధైర్యంతో బ్యాంక్ లో ఏదైనా ఒక జాబ్ సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. పూజ ఇటీవలే బ్యాంక్ పరీక్ష రాసింది. కానీ ఆ పరీక్షలో ఉత్తీర్ణత కాలేకపోయింది. అయినా నిరుత్సాహపడక ఏదో చేయాలని మరింత బలంగా మారింది. ఇదే సమయంలో ఆమె తండ్రి చేసే చిన్న అప్పడాల వ్యాపారం గుర్తుకు వచ్చింది.
తన ఆలోచనకు పదును పెట్టి ఆ వ్యాపారం ప్రారంభించింది. స్థానిక బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మెషీన్లు కొనుగోలు చేసింది. ఆ వ్యాపారంతోనే కొత్త జీవితాన్ని చూసుకుంది పూజా. అంతేకాక ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతున్న మహిళలకు ఉపాధి కల్పించింది. దీంతో కుమార్తె ఏమైతుందో అని బాధపడిన తల్లిదండ్రులకు కుమారుడిగా మారింది. ఆమెను యువత ఆదర్శంగా తీసుకుని కుటుంబానికి ఆసరగా ఉండాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. పూజ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.