కొంతమంది వ్యక్తులకు మందు తాగినపుడు ఒంటి మీద సోయ ఉండదు. ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. కొన్ని కొన్ని సార్లు దారుణాలకు కూడా తెగబడుతూ ఉంటారు. తమ అసభ్య ప్రవర్తనతో ఇతరులను వేధిస్తూ ఉంటారు. తాజాగా, ఓ వ్యక్తి తాగిన మత్తులో మహిళలను వేధించాడు. ఫోన్ నెంబర్ కావాలంటూ ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో విసిగిపోయిన ఓ మహిళ అతడికి తగిన బుద్ధి చెప్పింది. నడిరోడ్డుపై పెట్టి చెప్పుతో కొడుతూ ఇంకోసారి ఇలా చేయకుండా చేసింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతి పూట మందు తాగేవాడు. తాగి ఉన్నపుడు హద్దులు దాటి ప్రవర్తించే వాడు. అది కూడా మహిళల్ని టార్గెట్ చేసి వికృతి చేష్టలకు పాల్పడేవాడు. కొద్దిరోజుల క్రితం కూడా ఫుల్లుగా మందు తాగి రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న మహిళల దగ్గరకు వెళ్లాడు. వారిని ఫోన్ నెంబర్లు ఇవ్వాలంటూ వేధించసాగాడు. వారు వెళ్లిపోమని ఎంత మొత్తుకున్నా వినకుండా ఇబ్బంది పెట్టసాగాడు. అతడి ఆగడాలు పెచ్చు మీరి విలయతాండవం చేయటంతో అక్కడి జనానికి కోపం వచ్చింది.
అతడ్ని రోడ్డుపై పడేసి కొట్టారు. ఇంతలో ఓ మహిళ చెప్పుతో అతడి దగ్గరకు వచ్చింది. మహిళల్ని ఇబ్బంది పెడతావా అంటూ కొట్టసాగింది. దీన్నంతా అక్కడే ఉన్న వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తే ఇలానే ఉంటుంది’’.. ‘‘ మందు తాగితే మీరు అసలు మనుషులు కాదా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, మందు మత్తులో మహిళలతో తప్పుగా ప్రవర్తించి ఆ వ్యక్తి చెప్పు దెబ్బలు తిన్న ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Video: Drunk Man Harasses Women For Phone Numbers, Beaten With Slippers https://t.co/4oWHGwuWlT pic.twitter.com/ubneekqrOJ
— NDTV News feed (@ndtvfeed) December 30, 2022