ఈ మధ్యకాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికులు శ్రుతి మించి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణికులతో ర్యాష్ ప్రవర్తిస్తున్నారు. అంతేకాక విమానంలో పనిచేసే మహిళ సిబ్బందిపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే విమానంలో ఓ ప్రయాణికుడు.. పక్కనే ఉన్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. తాజాగా ఓ ఎయిర్ హోస్టస్ పై మరో ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ మధ్యకాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికులు శ్రుతి మించి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణికులతో ర్యాష్ ప్రవర్తిస్తున్నారు. అంతేకాక విమానంలో పనిచేసే మహిళ సిబ్బందిపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే విమానంలో ఓ ప్రయాణికుడు.. పక్కనే ఉన్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. అలానే మరో ఘటనలో విమానంలో సిగరెట్ కాల్చవద్దన్నందుకు సిబ్బందిపై ఓ ప్రయాణికులు చిందులేశాడు. తాజాగా ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టస్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గురువారం బ్యాంకాక్ నుంచి ముంబైకి కొంతమంది ప్రయాణికులతో ఇండిగో విమానం బయలుదేరింది. అందులో స్వీడెన్ కు చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్ బర్గ్(62)అనే వ్యక్తి కూడా ప్రయాణిస్తున్నాడు. అతడు విమానం ఎక్కిన సమయం నుంచి ప్రవర్తన చాలా తేడాగా ఉందని తోటి ప్రయాణికులు తెలిపారు. ఈక్రమంలో జోనాస్ తొలుత ఆహారం విషయంలో సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అతడు కోరుకున్న ఆహారం తమ వద్దలేదని విమాన సిబ్బంది చెప్పారు.
దీంతో వారిపై ఆగ్రహం సదరు ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. చివరకు ఎయిర్ హోస్టస్ సూచన మేరకు అతడు చికెన్ తినేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడికి చికెన్ అందించేందుకు ఎయిర్ హోస్టన్ పీఓఎస్ టర్నినల్ తో అతడి వద్దకు రాగా జోనాస్ ఆమె చేతిని అసభ్యకరంగా తాకాడు. అయితే అతడి ప్రవర్తనపై సదరు ఎయిర్ హోస్టస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె తిరస్కరించడంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు తోటి ప్రయాణికుల ముందే వేధింపులకు దిగాడు. చివరకు ముంబై చేరుకున్న తరువాత నిందితుడిపై బాధితురాలు ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేసింది.
అతడు తోటి ప్రయాణికులతో పాటూ ఇతర విమాన సిబ్బందినీ వేధించాడని బాధిత యువతి ఆరోపించింది. గురువారం ఇండిగో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో దిగాక పోలీసుల అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. గత మూడునెలల్లో భారత విమానాల్లో ఇలాంటి ఘటన వెలుగు చూడటం ఇది ఎనిమిదోసారి కావడంతో కలకలం రేగుతోంది. మరి.. విమానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.