పెళ్లిళ్లలో చిత్రవిచిత్రమైన ఘటనలో చోటుచేసుకుంటుంటాయి. ఈ మధ్యకాలంలో వరుడు వధువులు... తమ అల్లరి పనులతో పెళ్లిలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. ఇటీవలే ఓ వరుడు పెళ్లిపీటలపై నిద్రపోయిన సంగతి తెలిసింది. తాజాగా ఓ వరుడు ఏకంగా పెళ్లి మండపానికి రావడమే మర్చిపోయాడు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన వేడుక. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని యువత భావిస్తుంటారు. ఇక తమ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు వధువరుల కుటుంబ సభ్యులు రెడీగా ఉంటారు. ఇలా ఎన్నో పెళ్లి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతుంటాయి. అయితే కొన్ని పెళ్లి వేడుకల్లో సరద ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. పెళ్లిమండపంపై వధువరులు ఫైటింగ్ చేసుకోవడం, మద్యం మత్తులో బంధువులు చిందులు వేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే ఓ పెళ్లిలో మాత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి ఉందనగా పెళ్లి మండపానికి రావడం వరుడు మర్చిపోయాడు. మరి.. అతడు ఎలా మర్చిపోయాడు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్ లోని భాగల్ పూర్ ప్రాంతంలో నివాసం ఉండే మియాన్ అనే యువకుడికి సుల్తాన్ గంజ్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం ఉదయం వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రే వధువు తరపు వారు పెళ్లికి ఘనంగా ఎర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల బంధువులు మండపం వద్దకు చేరుకున్నారు. ఇక పెళ్లికి వచ్చిన అతిథులతో పెళ్లి మండపం సందడిగా మారింది. వివాహని ముందే పెళ్లి వేడుకలో కొందరు డ్యాన్స్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. మరోవైపు కొందరు మద్యం మత్తులో మునిగిపోయారు.
ఇక మంగళవారం ఉదయం కళ్యాణ మండపానికి చేరుకున్న వధువు.. వరుడి రాకకోసం ఎదురు చూసింది. మూహుర్తం సమయం దాటిపోతున్న పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అసలు ఏం జరిగిదంటే సోమవారం రాత్రి మద్యం సేవించిన గ్రూప్ లో పెళ్లి కొడుకుకూడా ఉన్నాడు. తన స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి ఫుల్ గా మద్యం సేవించాడు. అతడికి మెలకువ వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఏదోవిధంగా వధువు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వివాహం చేయాడానికి వరుడి తరపు వారు ప్రయత్నించారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సమయంలో కూడా వరుడు మరోసారి మద్యం సేవించాడు. అలానే కళ్యాణ మండప వద్దకు వరుడు చేరుకున్నాడు.
మద్యానికి బానిసైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన జీవితం నరకప్రాయం అవుతుందని వధువు భావించి.. పెళ్లి వద్దంటూ తిరస్కరించింది. అలానే తాము కట్నకానుకలు కింద ఇచ్చినవి, పెళ్లి కోసం చేసిన ఖర్చులను ఇచ్చేయాలని వధువు తరుపు వారు పట్టుబట్టారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గొడవకు దారితీసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు కుటుంబాలను సముదాయించారు. పోలీసులు చెప్పిన మాటలతో ఇరు కుటుంబాల వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెళ్లికాక ఎందరో యువకులు అష్టకష్టాలు పడుతుంటే.. మద్యం కారణంగా ఇలాంటి వాళ్లు వచ్చిన సంబంధాలను చెడగొట్టుకుంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.