దేశానికి స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రయాణాలకు సరైన వసతులు లేవు. ఐదేళ్లకు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆ ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అడిగి తర్వాత అటు ముఖం కూడా చూడరు. భారతదేశం రోజురోజుకూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇది కేవలం పట్టణాల్లో మాత్రమే.. కానీ ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఆఖరికి శ్మశానానికి వెళ్లాలన్నా నడకే దారే గతి. అందులోనూ చెట్లు, పుట్లు, గుంగలు ఇలా ఎన్నో కష్టాలు పడి ఆసుపత్రులకు వెళ్లాలి.
ఇక గర్భిణుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. పురిటి నొప్పులు వస్తే ఆ మహిళను తీసుకు రావడానికి ఎన్నో అవస్థలు పడుతుంటారు. వీటికి సంబంధించి ఎన్నో కథనాలు మీడియాలో వచ్చినా వారి పరిస్థితి మాత్రం మారడం లేదు. ఛత్తీఘర్ లోని ఓ మారుమూల గ్రామంలో ఉండే గర్భిణికి పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. ఆ గ్రామంలో రోడ్డు మార్గం మొత్తం ధ్వంసమైంది.. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. 108 కి ఫోన్ చేసినా లాభం లేకపోయింది. ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఓక బొంగు కర్రకు మంచాన్ని కటి ఆమెను తీసుకు వేల్లారు.
అదే సమయంలో అక్కడకి ఓ జవాన్ వచ్చాడు. గర్బిణీని చూసి మానవత్వాన్ని చాటుకున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు ఆ జవాన్ కూడా బొంగును భుజంపై వేసుకొని ఆస్పత్రి వరకు మోసుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దేశాన్ని రక్షించే జవాన్ నీ మానవత్వానికి మా సెల్యూట్ అంటై కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH A jawan of the District Reserve Guard force along with locals carried a pregnant woman on a cot to help her reach the hospital in Dantewada, Chhattisgarh
The woman and her newborn baby are in good health, said IG Bastar P Sundarraj pic.twitter.com/erQJyEMT8G
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 20, 2022