ప్రజలకు న్యాయం చెప్పి.. వారికి అండగా నిలబడాల్సిన ప్రజా ప్రతినిధులే కొన్ని సందర్భాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోడలిని కట్నం కోసం హింసిస్తోన్న ఓ ఎమ్మెల్యే బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో చోటు చేసుకుంటున్న నేరాల్లో వివాహేతర సంబంధాలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. క్షణకాల సుఖం కోసం.. నమ్మి వచ్చిన భాగస్వామిని మోసం చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే.. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. అయితే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిలో సామాన్యులు మాత్రమే కాక రాజకీయ నేతలు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఇక తాజాగా ఓ మహిళ ఇలాంటి ఆరోపణలే చేసింది. తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాక అత్తింటి వారు తనను కట్నం కోసం వేధిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ స్విస్ట్ ఏంటంటే.. సదరు బాధితురాలు.. ఎమ్మెల్యే ఇంటి కోడలు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. జనాలకు మంచి చెప్పాల్సింది పోయి.. ప్రజా ప్రతినిధే ఇలా చేయడం ఎంత వరకకు సబబు అంటున్నారు జనాలు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కేంద్రపడా నియోజకవర్గ ఎమ్మెల్యే, అధికార బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి శశిభూషణ్ కుమారుడు, అతడి కుటుంబ సభ్యులపై ఆయన కోడలు ఈ ఆరోపణలు చేసింది. శశి భూషణ్ కుటుంబం తనను వరకట్నం కోసం వేధిస్తుందని పేర్కొంది. దాంతో.. ఎమ్మెల్యే, అతని కుటుంబం తనను శారీరంగా, మానసికంగా వేధిస్తున్నారని.. వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ శశి భూషణ్ భార్య రోనాలి బెహరా బంకి ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోనాలి బెహరాకు, శశిభూషణ్ కుమారుడు సత్యప్రకాష్‌తో 2021, మార్చి 3 వివాహం జరిగింది.
వివాహం సందర్భంగా రోనాలి బెహరాకు ఆమె తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చారు. అయినా సరే తన అత్తమామలు, భర్త, ఆడపడుచులు, ఇతర కుటుంబీకులు కట్నం కోసం వేధించడమే కాక.. మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని.. కట్నం కోసం హింసుస్తున్నారని చెప్పుకొచ్చింది. పైగా తన భర్త సత్యప్రకాష్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది. సత్యప్రకాష్, అతడి కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాలు తీర్చాలని నిరంతరం వేధిస్తున్నారని.. అంతేకాక తన తల్లిదండ్రులు వద్ద నుంచి 40 లక్షల రూపాయలు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది.
పెళ్లై, అత్తారింటికి వచ్చిన 10 రోజులకు.. తనకు పుట్టింటి వారు పెట్టిన నగలను బలవంతంగా తీసుకున్నారని.. పైగా అదనపు కట్నం కోసం ఇప్పటికి వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే రోనాలి చేసిన ఆరోపణలు అవాస్తమని సత్య ప్రకాష్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. శశిభూషణ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.