కొందరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే.. ‘ముక్కలేనిదే ముద్ద దిగదురా బాబోయ్’ అనేంతలా. ఉదాహరణకు ప్రైస్ ఎక్కువని వెజ్ బిర్యానీ బుక్ చేస్తే.. పొరపాటున నాన్ వెజ్ బిర్యానీ వచ్చిందనుకోండి. ఆహా.. ఆ సమయంలో మన ఆనందం ఎలా ఉంటుంది. తొందరగా ప్లేట్ తీసుకురా తినేద్దాం.. మళ్ళీ వాడొస్తాడేమో.. ఇదే ఆలోచనతో ఉంటాం. అచ్చం ఇలాంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది. అయితే అయన మనలా ఆలోచించలేదు.. నేను శాకాహారిని అయితే.. నాకు నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేస్తావా అంటూ కోర్టుకు ఎక్కాడు. కోర్టు కూడా ఆయనకు వత్తాసు పలికి.. సదరు పిజ్జా డెలివరీ చేసిన సంస్థకు భారీ ఫైన్ విధించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్, రూర్కీకి చెందిన శివంగ్ మిట్టల్ సహా ఆయన కుటుంబసభ్యులందరూ శాఖాహారులే. ఈ క్రమంలో ఒకరోజు పిజ్జా తినాలనిపించి రూ.918 చెల్లించి డొమినోస్ లో వెజిటేబుల్ పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే సదరు సంస్థ పొరపాటున నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేసింది. మంచి ఆకలిమీదున్న శివంగ్ మిట్టల్.. పిజ్జాస్కెల్ డిఫరెంట్ ఉండటంతో అనుమానం కొద్దీ ఓపెన్ చేశాడు. అది నాన్ వెజ్ పిజ్జా కావడంతో వాసనకే వాంతులు చేసుకున్నాడు. ఈ సంఘటన అక్టోబర్ 26, 2020న జరిగింది. వెంటనే శివంగ్ పోలీసులను ఆశ్రయించాడు. వారు పట్టించుకోకపోవడంతో.. 2021లో వినియోగదారుల ఫోరమ్ ని అశ్రయించాడు. తాను డొమినోస్ నిర్లక్ష్యం కారణంగా శారీరకంగా, మానసికంగానే కాదు.. ఆర్ధికంగా కూడా నష్టపోయినట్లు కోర్టుని విన్నవించాడు. జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టింది.
ఇది కూడా చదవండి: Maharashtra: పిల్లి పిల్ల అనుకొని ఈ చిన్నారి ఇంటికి ఏం తెచ్చిందో చూస్తే బైండ్ బ్లాక్!ఎట్టకేలకు డామినోస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరించినట్లు గుర్తించిన వినియోగదారుల ఫోరమ్.. డామినోస్ ను మందలించడమే కాకుండా భారీ ఫైన్ విధించింది. శివాంగ్ చెల్లించిన రూ. 918 కు 6 శాతం వడ్డీ చొప్పున రూ 4.65 లక్షలతో పాటు ప్రత్యేక జరిమానాగా రూ. 5 లక్షలు, వినియోగదారుల ఫోరమ్ కు 50 వేలు చెల్లించాలని పేర్కొంది. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే.. వచ్చింది కదా అని తినేయకుండా.. ఈయనలా ఆలోచించండి.