డాలీ జైన్ ఎవరికైనా చీర కడితే 30 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఫీజు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె సెలెబ్రిటీ శారీ డ్రేపర్‌గా ఉన్నారు.
చీర భారత దేశపు సంప్రదాయం మాత్రమే కాదు. ఆడవాళ్ల అందాన్ని పెంచే ఓ మంచి డ్రెస్ కూడా. ‘ భామ.. నీ చీరకట్టు.. చూపులన్ని కొల్లగొట్టు’ అని ఓ సినీ రచయిత అన్నాడు. చీర కట్టు కారణంగా ఆడవారిలో అందం రెట్టింపు అవుతుంది. ఇప్పుడంటే చీర కట్టే వాళ్లు తక్కువయ్యారు కానీ, ఒకప్పుడు పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు చీరలు కట్టడానికి ఎంతో ఇష్టపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చాలా కొద్ది మంది మాత్రమే చీరలు కడుతున్నారు. అది కూడా ఏదో పండుగకో.. పబ్బానికో చీరలు కడుతున్నారు. చాలా మందికి ఎలా చీరలు కట్టాలో కూడా తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే బాగా చీరలు కట్టడం తెలిసిన వారు.. దాన్నే తమ ఉపాధిగా మలుచుకుంటున్నారు. చీర కట్టడం తెలియని వారికి చీర కట్టి డబ్బులు సంపాదిస్తున్నారు.
అలాంటి కోవకు చెందిన వారిలో డాలీ జైన్ దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఆమె సెలెబ్రీల పెళ్లిళ్లకు హీరోయిన్స్‌కు చీరలు కడుతూ ఉంటుంది. ఇతర మహిళలకు చీరలు కట్టి లక్షలు సంపాదిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. డాలీ జైన్‌కు చిన్నప్పటినుంచి చీరలు కట్టడం అంటే ఇష్టం లేదు. అలాంటి ఆమె పెళ్లి తర్వాత పూర్తిగా మారింది. అత్తింటి వారు చీర కట్టకపోతే ఒప్పుకునే వారు కాదు. దీంతో ప్రతీ రోజూ చీరలు కట్టేది. ఆమెకు చీర కట్టుకోవటం రాని కారణంగా దాదాపు 45 నిమిషాల సమయం పట్టేది. తనకు చీర కట్టుకోవటం ఇబ్బందిగా ఉందని అత్తింటి వారికి చెప్పింది. వారు వినలేదు. చీర కట్టి తీరాల్సిందే అని అన్నారు. అత్తింటి వారి ఆజ్ఞ మేరకు ఆమె ప్రతి రోజూ చీర కట్టసాగింది. తర్వాతి కాలంలో ఆమెకు చీరకట్టుమీద ప్రేమ మొదలైంది.
దీనికి తోడు చాలా మంది ఆడవాళ్లు చీరలు కట్టడం మానేశారు. అప్పుడు ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. చీర కట్టును గ్లోబల్ మ్యాప్‌లో ఉంచాలని భావించింది. చీర కట్టడాన్ని తన వృత్తిగా మార్చుకుంది. ఎంతో శ్రమించి 325 రకాలుగా చీరలు కట్టడం నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె సెలెబ్రిటీలకు చీరలు కడుతోంది. వారికి చీర కట్టడం ద్వారా 30 వేలనుంచి 2 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్లకు డాలి జైనే చీరలు కట్టింది. అంతేకాదు! ఆమె కొంతమంది మహిళలకు కూడా చీరలు కట్టారు. మరి, డాలీ జైన్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.