ఓ కుక్క ప్రతిరోజు లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తోంది. అది కూడా ఒకే రూటులో ప్రయాణం చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా మనుషులు తమ అవసరాల కోసం వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. బైకులు, బస్సులు, ట్రైన్‌లు, విమానాలు ఇలా ఏదో ఒక దాంట్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కేవలం ఇది మనుషులకు మాత్రమే ఉన్న సౌలభ్యం. కానీ, మిగిలిన జీవులకు ఆ సౌలభ్యం లేదు. కుక్కలు, ఆవులు, గేదెలు ఇతర జంతువులు వాహనాల్లో ప్రయాణించటానికి అవకాశం ఉండదు. అది కూడా ఎవ్వరి తోడూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయటం అన్నది చాలా కష్టం. ఇక, జంతువులు వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.
అలాంటి అరుదైన సంఘటనే ముంబైలో చోటుచేసుకుంది. ఓ కుక్క ప్రతిరోజూ లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తోంది. అది కూడా ఓ రూట్‌లో ఓకే చోటుకు వెళ్లివస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ కుక్క మహారాష్ట్ర, ముంబైలోని బోరివాలిలో నివాసం ఉంటోంది. ఈ కుక్క బోరివాలిలోని ట్రైన్ స్టేషన్‌కు ప్రతి రోజు వెళుతుంది. అక్కడ అంధేరికి వెళ్లే టోకల్ ట్రైన్ ఎక్కుతుంది. సరిగ్గా అంధేరి స్టాప్ రాగానే ట్రైన్ దిగిపోతుంది. అక్కడే రాత్రి వరకు ఉంటుంది. రాత్రి మళ్లీ అంధేరీలో ట్రైన్ ఎక్కుతుంది. మళ్లీ తన నివాస ప్రాంతమైన బోరివాలికి వచ్చేస్తుంది. ఇలా ఒకటి, రెండు కాదు.. చాలా రోజులుగా చేస్తోంది.
ఈ కుక్క ట్రైన్‌లో ప్రయాణిస్తున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు ఆ కుక్క ఎందుకలా చేస్తోందని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి దీనిపై స్పందిస్తూ.. ‘ఆ కుక్కకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజు ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.