గుండె పోటుతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించిన ఓ శునకం మూడు నెలలుగా నిరీక్షిస్తుంది. తన యజమాని కోసం ఆ కుక్క అలా కళ్లు కాయలు కాసేలు ఎదురు చూస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
విశ్వాసం అనగానే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది కుక్క. దాని విశ్వాసం ఎంత గొప్పదో మనందరికి తెలిసిందే. యజమాని పట్టెడు అన్నం పెడితే చాలు.. ఇక జీవితాతం ఆయన కోసమే ఉంటుంది. తన యజమానిని కంటికి రెప్పలా కాపాడుతూ.. ఎవరైనా హాని చేయాలని చూస్తే తన ప్రాణాలను సైతం అడ్డు పెడుతుంది. అలా పట్టెడు అన్నం పెట్టిన వారిని విశ్వాసంతో జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. తాజాగా ఓ శునకం తన యజమాని మరణించిన విషయం తెలియక.. మూడు నెలల నుంచి రాత్రింబవళ్లు ఆస్పత్రి వద్ద ఎదురు చూస్తోంది. ఉన్నచోటు నుంచి కదలకుండా ఆసుపత్రిలోనే ఉండింది. ఆ మూగజీవికి అతడు ఇక ఎప్పటికీ తిరిగి రాడని తెలియక కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూస్తోంది. కంటతడి పెట్టించే ఈ దృశ్యం తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మోహన్ కుమార మంగళం అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉండే వాడు. అయితే మోహన్ కుమార ఓ కుక్కును పెంచుకునే వాడు. ఆ శునకాని మోహన్ కుమార ఎంతో ఆప్యాయంగా చూసుకునే వాడు. అయితే మూడు నెలల క్రితం గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు. యజమాని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కుక్క కూడా ఆయన వెంట వెళ్లింది. ఇక అప్పటి నుంచి రేయింబవళ్లును తన యజమాని వెళ్లిన ముఖద్వారం వద్దనే నిరీక్షిస్తుంది.
ఈ క్రమంలో ఆయన మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్పత్రి సిబ్బంది ఆయన మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే ఆ శునకం మాత్రం యజమాని లోపలే ఉన్నారని భావించి మూడు నెలలుగా ఆయన రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. అటుగా లోపలి నుంచి ఎవరు వచ్చిన తన యజమాని వచ్చాడని ఉల్కిపడి లేచి చూసేది. ఆయన కాదని తెలిసి.. నిరుత్సాహంతో అలా ఉండిపోయేది. ఆస్పత్రి వద్ద ఉండే సెక్యూరిటీ ఆ శునకాన్ని పంపేసినా మళ్లీ తిరిగి వచ్చి.. ఆ ద్వారం వద్దనే కూర్చునేది.
యజమానిపై ఆ కుక్కకు ఉన్న ప్రేమను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. తన యజమాని చనిపోయాడని తెలియక.. ఆ కుక్క రేయింబవళ్లు అక్కడే నిరీక్షించడాన్ని చూసిన కొందరు కంటతడి పెట్టుకున్నారు. ఆసుపత్రి సిబ్బందే దానికి ఆహారం అందిస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డలే తమకు సంబంధం లేదంటూ తల్లిదండ్రులను వదిలేస్తున్నా ఈ కాలంలో, పట్టేడు అన్నం పెట్టినందుకు ఈ మూగ జీవం ఎంతో విశ్వాసం చూపిస్తుంది. హృదయాలను ద్రవింప చేస్తున్న ఈ దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.