ఆధార్ కార్డు.. ఈ 12 అంకెల గుర్తింపు కార్డు మనదేశంలో ప్రతీ ఒక్కరికి ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాలు అందలన్నా, ఇంటర్వ్యూకి వెళ్లాలన్న, మరేదానికైన దరఖాస్తు చేసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పక ఉండాల్సిందే అంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
2009 జనవరి 28 నాటికి UIDAI పనిచేసింది. అయితే ఆ తర్వాత 2016 మార్చి 3 న ఆధార్‍కు చట్టపరమైన మద్దతు ఇవ్వాలని పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అది కొన్ని రోజుల తర్వాత 2016లో లోక్ సభ ఈ చట్టానికి ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరు వేలు ముద్రలు, కొద్దిపాటి వివరాలతో కూడిన ఈ గుర్తింపు కార్డుకి ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవడంతో ఇప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరి వద్ద ఆధార్ కార్డు ఉంది.
పూణేకు 47 కిలోమీటర్ల దూరంలో టెంబాలి అనే గ్రామంలో రంజనా సోనావానే అనే మహిళ నివాసం ఉండేది. అయితే మొదట్లో ప్రత్యేకంగా ఈ మహిళ కోసం 2010లో ఆధార్ కార్డు రూపొందించి అందజేశారు. ఇక మన దేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు అందుకున్న గ్రామంగా కూడా టెంబాలి గ్రామం రికార్డులోకెక్కింది.