దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు ఔషధాలు రాలేదు. వ్యాక్సిన్లు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో ఉండడంలేదు. శరీరంపై గో మూత్రం, పేడ పూసుకుంటే కోవిడ్ రాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గోశాలలకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆవుపేడను మూత్రమిశ్రమంతో కలిపి ఒంటికి పూసుకొని అది ఎండిపోయే వరకు ఆశ్రమంలో వేచి ఉంటారు. అనంతరం ఆశ్రమంలో ఆవును కౌగిలించుకుంటారు. అనంతరం పాలు లేదా మజ్జిగతో శరీరాన్ని కడుగుకుంటారు. కాగా ఆవుపేడ చికిత్సల వల్ల ఆరోగ్య సమస్యలు క్లిష్టతరం అవుతాయని వైద్యులు హెచ్చరించారు. దీంతో చాలా మంది సంప్రదాయ వైద్యంవైపు మొగ్గుచూపుతున్నారు. గుజరాత్‌కు చెందిన కొందరు వారానికి ఒక రోజు గోశాలలకు వెళ్లి తమ శరీరానికి ఆవుపేడ, మూత్రాన్ని పూసుకుంటున్నారు. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ నుంచి తొందరగా కోలుకుంటారని భావిస్తున్నారు.
ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. శతాబ్దాలుగా గోమూత్రాన్ని ఇళ్లను శుద్ధి చేయడానికి పూజలకు వాడుతున్నారు. అలాగే చికిత్సల్లోనూ యాంటి సెప్టిక్ ఔషధంగా వినియోగిస్తున్నారు. అందుకే ఆవుపేడ కరోనాను తరిమికొడుతుందని విశ్వసిస్తున్నారు. ఆవు పేడను ఒంటికి పూసుకోవడం వల్ల కరోనా పోవడం మాటమే గానీ, ఇతర వ్యాధులు వ్యాపించే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు కోవిడ్-19కు ప్రత్యామ్నాయ చికిత్సలను అన్వేషించాలని పదే పదే హెచ్చరిస్తున్నారు.. ఇటువంటి ప్రమాదానికి దారితీసి ఆరోగ్య సమస్యలను క్లిష్టతరం చేస్తాయని అంటున్నారు. ‘‘కోవిడ్-19కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆవు పేడ లేదా మూత్రం పనిచేస్తుందనే దానిపై ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, ఇది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంది’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ అన్నారు.