ఈ మధ్య దేశంలోని పలు రాష్ట్రాలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. కరెంట్ ఉండే సమయంలో కంటే కోతల సమయం ఎక్కువగా ఉందనేది చాలా మంది అభిప్రాయం. అలా విద్యుత్ లేకపోవడంతో ఆసుపత్రుల్లో రోగులు నరకం అనుభవిస్తున్నారు. కొన్నిచోట్ల టార్చ్ లైట్ వెలుగుల్లో ఆపరేషన్ లో చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ ఆసుపత్రిలో వృద్ధురాలికి చికిత్స చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరి.. ఈ దారుణం ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో కరెంట్ కోతల ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒక్కటి. ఆ రాష్ట్రంలోని కోట పట్టణం ఈ ఘోరం చోటుచేసుకుంది. ఆరోగ్యం బాగలేదని ఓ వృద్దురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించి ICUలో ఉంచారు. ఈ క్రమంలో ఆమెకు వైద్యులు చికిత్స చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది. దాంతో వెంటిలేటర్ పై ఉన్న ఆమె పరిస్థితి మరింత దిగజారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అప్రమత్తమైన వైద్యులు ఆమెకు టార్చ్ లైట్ వెలుగులో చికిత్స చేశారు. వారు ఎంత ప్రయత్నాలు చేసిన ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.
దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రోగిని కాపాడటానికి తమ శాయశక్తుల కృషి చేశామని, విద్యుత్ అంతరాయం వల్ల రోగి చనిపోయిందని అక్కడ వైద్యులు తెలిపారు. ఇలా కరెంట్ కోతల వలన చాలా మంది రోగుల పరిస్థితి ఇలానే ఉందని తెలిపారు. అయితే చీకట్లో టార్చ్ లైట్ వెలుగులో వైద్యం అందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Science city Kota
— राजस्थानी ट्वीट (@8PMnoCM) April 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.