ఎవరికైనా ఆకలి వేస్తే ఏదైనా ఆహార పదార్థాలు కానీ.. అవి దొరక్కపోతే మంచినీరు తాగి తమ ఆకలి తీర్చుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఆహారంగా మేకులు, సూదులు, ఇనుప వస్తువులు, నాణేలు తింటూ వస్తున్నారు. కొన్నిసార్లు వారు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం.. డాక్లర్లు వైద్యం చేసి అవన్నీ తొలగించి బతికించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా ఎవరికైనా ఆకలి వేస్తే అన్నం తింటారు.. లేదా పండ్లు కానీ.. రొట్టెలు, బ్రెడ్డు ఏదో ఒకటి తన కడుపు నింపుకోవడానికి ఎన్ని బాధలైనా పడుతుంటారు. ఒక్కోసారి ఆహారం లభించకపోతే మంచినీరు తాగైనా సరే ఆకలి బాధ తీర్చుకుంటాడు. కానీ కొంతమంది మాత్రం వీటన్నింటికి విరుద్దుంగా చాలా చిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆకలి వేస్తే మన్ను తినడం, మేకులు, సూదులు, నాణేలు తినడం చూస్తుంటాం. కొంత కాలం తర్వాత కడుపు నొప్పితో వైద్యులు చికిత్స చేసి వాటిని తొలగించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓ యువకుడి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు.. అతని కడుపు ఎక్స్ రే తీయగా డాక్టర్లు విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. యువకుడి కడుపులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 బ్లేడు ముక్కలను విజయవంతంగా ఆపరేషన్ చేసి బయటకు తీశారు. రాజస్థాన్ జాలోర్ జిల్లాకు చెందిన యశ్ పాల్ సింగ్ అనే యువకుడికి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు అద్భుతం చేశారు. జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన యశ పాల్ సింగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో డెవలపర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం అతనికి ఒక్కసారే కడుపు నొప్పి రావడంతో స్నేహితులు దగ్గరలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అతడి పరిస్థితి బాగాలేదని పెద్దాసుపత్రికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే యశ్ పాల్ సింగ్ ని నగరంలోని మెడిప్లస్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే మిగతా వైద్య పరీక్షలు చేసిన ఆశ్చర్యానికి గురయ్యారు.
యశ్ పాల్ సింగ్ కడుపులో ఏకంగా 56 బ్లేడు ముక్కలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రికి తరలించిన సమయానికి అతని ఆక్సీజన్ లెవెల్స్ 80 ఉన్నాయని వైద్యులు తెలిపారు. యశ్ పాల్ కి ఆపరేషన్ చేసి 56 బ్లేడ్ ముక్కలను బయటకు తీశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలాంటి ఆపరేషన్ చాలా కష్టంతో కూడుకున్న విషయమని.. చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుందని.. ఎక్కువ సమయం తీసుకొని విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశామని డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం బాగానే ఉందని అన్నారు. అయితే యువకుడి కడుపులోకి బ్లేడ్ ముక్కలు ఎలా వచ్చాన్న విషయం తెలపలేదు.. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.