కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో భయాందోళనకు గురవుతుంటే.. తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా పాట్నాలోని నలందా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. పాట్నాలోని నలందా మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో పని చేస్తున్న 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా సోకిన వైద్యులకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు.
ఇటీవలే పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. బీహార్‌లోని ఐదు జిల్లాల్లో, రాజధాని పాట్నాలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలగా.. మరో 75 మందికి ఆదివారం వైరస్ నిర్ధరణ అయింది.
ఇది కూడా చదవండి : బండి సంజయ్ కాలర్ పట్టుకున్న పోలీసు! రంగంలోకి అమిత్ షా!
కొవిడ్ సోకిన వారిలో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగతా వారంతా హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, సిబ్బంది, పరిసరాల్లో కరోనా కలకలం రేపింది. ఎన్ఎంసీహెచ్ వైద్యులు కరోనా బారినపడిన నేపథ్యంలో పట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు ముమ్మరం చేసింది. ఒమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.