తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'స్నేహితుడు' మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో వాట్సాప్ కాల్ ద్వారా ఓ గర్భిణీకి హీరో ప్రసవం చేస్తాడు. అచ్చం అలాంటి సంఘటన నిజ జీవితంలో కూడా జరిగింది.
ఇళయ దళపతి విజయ హీరోగా నటించిన ‘స్నేహితుడు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటితరం యువత చదువును ఎలా కొనసాగించాలి, స్నేహం గొప్పతనం ఏమిటో అనే విషయాలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ అందరిని ఆకట్టుకుంది. అందులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రసవం చేశారు. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీ సాయంతో ఎలా భయట పడొచ్చో దర్శకుడు చక్కగా చూపించాడు. అచ్చం అలాంటి సీన్ నిజ జీవితంలో కూడా జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా వాట్సాప్ కాల్ తో ఓ మహిళకు వైద్యులు ప్రసవం చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జమ్ముకశ్మీర్ లోని కుప్పారా జిల్లా కెరన్ అనే మారముమూల ప్రాంతంలో ఓ గర్భీణి నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో గురువారం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఇదే సమయంలో అక్కడి వాతారవరణం ప్రతికూలంగా మారింది. అందులోనూ ఆ గ్రామం ఎక్కడో కొండల మధ్య ఉంది. దీంతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇదే సమయంలో ఆ నిండు చూలాలు పురిటి నొప్పులతో బాధ పడుతుంది. ఆమె చూడలేక బంధువులు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్పించారు. అయితే కాన్పు కష్టంగా మారడంతో అక్కడి నుంచి క్రాల్పోరా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించాలని భావించారు.
మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్న అక్కడకు పంపితే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారని వైద్యులు భావించారు. అయితే వాతావరణం ప్రతికూలంగా మారింది. అందులో వలన అధికారులు కూడా విమానాన్ని సిద్ధం చేయలేకపోయారు. ఈ క్రమంలో క్రాల్పోరా ఆస్పత్రి వైద్యుదు పర్వేజ్ వాట్సాప్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ అర్షద్ సోఫీ, ఇతర సిబ్బందికి.. ప్రసవం ఎలా చేయాలో గైడ్ చేశారు. సదరు వైద్యుడు ఓ స్క్రీన్ ఏర్పాటు చేసి.. ప్రసవం ఎలా చేయాలో దానిపై చూపించారు. ఆ వైద్యుడి సూచనలను వారు పాటిస్తూ గర్భిణీకి విజయవంతంగా ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గురు, ,శుక్ర,శనివారం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని కూడా మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దట్టంగా మంచు కురవడంతో విమాన రాకపోకలు కూడా ఆగిపోయాయి. పలు జిల్లాలోని చాలా చోట్ల గురు, శుక్రవారాలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇలాంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాట్సాప్ కాల్ ద్వారా గర్భీణికి ప్రసవం చేసి కాపాడిన వైద్యులపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.