దేవుడు మనకు ప్రాణాలు పోస్తే.. ఏ ప్రమాదం వచ్చినా ఆ ప్రాణాలు రక్షించేది వైద్యులు. అందుకే వైద్యో నారాయణో హరీ అంటారు మన పెద్దలు. దేవుడి తర్వాత అంతగొప్ప స్థానాన్ని మనం వైద్యులకే ఇస్తుంటాం. కానీ ఈ మద్య వైద్య వృత్తికే కలంకం తెచ్చే సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
వైద్యో నారాయణో హరీ.. అంటారు పెద్దలు. దేవుడు మనకు ఆయువు పోస్తే.. వైద్యులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆయువుని పోస్తాడు. అందుకే వైద్యులను దేవుడితో పోలస్తుంటారు. కానీ ఈ మద్య వైద్య వృత్తి కమర్షియల్ అయిందని అంటున్నారు.. కొంతమంది డాక్టర్లు చేసి నిర్వాకాలు సామాన్యులకు ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. గొప్ప వైద్య వృత్తిలో ఉండి కొంత మంది డబ్బు సంపాదనే పరమావధిగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు పేషెంట్ రోగం ఒకటైతే, ట్రీట్మెంట్ మరోకటి చేశారు. దీంతో ఆ పెషెంట్ కొత్త సమస్యతో లోబో దిబో అంటుంది. ఈ ఘటన కేరళా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కేరళా రాష్ట్రం కక్కోడి కి చెందిన సజినా సుకుమారన్ ఎడమ కాలు మడమ నొప్పితో కొంతకాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయించాలని భావించారు. మావూరు రోడ్డు లోని రాష్ట్రీయ ఆస్పత్రి కి చెందిన డాక్టర్ బెహిర్షన్ ఆమెకు చికిత్స అందించారు. సజినాకు ఎడమ కాలు మడమ ఆపరేషన్ చేయడానికి సిద్దమై ఆపరేషన్ థియేటర్లోకి తీసుకు వెళ్లారు. అక్కడ సజినాకు కాలు మెడమకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఇక సర్జరీ అనంతరం సజినా లేచి చూసి షాక్ కి గురైంది.. ఎందుకంటే ఆమె ఎడమ కాలు నొప్పి అని వెళ్తే.. సదరు డాక్టర్ బెహిర్షన్ కుడికాలుకు ఆపరేషన్ చేశాడు.
ఈ విషయంపై తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది సజినా . వెంటనే వారు నర్సును నిలదీయడంతో తనకు ఏమీ తెలియదని.. డాక్టర్ ని అడగాలని సూచించింది. వెంటనే డాక్టర్ బెహిర్షన్ పిలిచి నిలదీయగా, తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పాడు. అప్పటి వరకు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఇటీవల డోర్ తాకడంతో ఎడమకాలు బాగా నొప్పి కలగడంతో ఆపరేషన్ చేయించుకోవాలని వస్తే.. డాక్టర్ నిర్లక్ష్యం తన ప్రాణాల మీదకు తెచ్చిందని వాపోయింది సజినా. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని కన్నీరు పెట్టుకుంది.
ఈ విషయంపై స్పందించిన సజినా కూతురు తన తల్లికి కుడి కాలులో కూడా బ్లాక్ ఉందిన.. ఆ కాలు బ్లాక్ ని గుర్తించడానికి డాక్టర్లు ఎలాంటి ఎక్స్ రే, స్కాన్ చేయలేదని అన్నారు. ఈ విషయాన్ని డీఎంవొ, ఆరోగ్యశాహా మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ విషయం గురించి ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ.. గత కొంత కాలంగా సజినాకు శస్త్ర చికిత్స చేస్తున్నాడు డాక్టర్ బెహిర్షన్. ఈ క్రమంలో ఆమె కుడికాలుని పరిశీలించగా గాయం కారణంగా నొప్పి వస్తుందని భావించి ఈ విషయం సుజనా కి తెలిపినట్లు అధికారులు అంటున్నారు.