వెనుకబడిన వర్గాల నుంచి ఎందరో అత్యున్నత పదవులు చేపడుతున్నారు. మరి కొందరు రాజకీయలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతలుగా గుర్తింపు సంపాదించారు. అయినా అనేక చోట్లు చాలా మంది కులవివక్షతకు గురవుతున్నారు. ఈ వివక్షత కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా అధికారులను, వైద్య వృతిలో ఉన్న వారిని సైతం వెటాడుతుంది. తాజాగా ఓ వైద్యుడు పై కులవివక్షత చూపించారు. ఆ బాధను తట్టుకోలేక సదరు వైద్యుడు కన్నీటి పర్యతమయ్యాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. డాక్టర్ వెక్కి వెక్కి ఏడ్చిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హర్యానాలోని భివానీ ఆస్పత్రిలో ధర్మేంద్ర అనే వ్యక్తి వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఇతని స్వస్థలం బిహార్. వైరల్ అవుతున్న వీడియోలో వైద్యుడి వాయిస్ క్లారిటీ లేదు. ధర్మేంద్ర చెప్పిన వివరాల ప్రకారం.. భివానీ జనరల్ ఆస్పత్రిలో ఆయన పనిచేస్తున్నారు. డాక్టర్ అయిన ఆయనకు ఆస్పత్రిలో కూర్చునేందుకు స్థలం ఇవ్వడం లేదని తెలిపారు. ఈక్రమంలో చికిత్స కోసం వచ్చే రోగులను చూడాలన్నా తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇదంతా కులవివక్షతోనే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆస్పత్రిలో కూర్చునేందుకు ధర్మేంద్రకు కుర్చీ ఇ్వవడం లేదని, ఆయన కులాన్ని చూసి వారు ఇలా చేస్తున్నారు. అందుకే మనోవేదన గురై ఒక్కసారిగా ఏడ్చేశారని వీడియో తీసిన వ్యక్తి తెలిపారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులకు వైద్యుడు ధర్మేంద్ర ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, కులవివక్ష కారణంగానే వైద్యుడిని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ ఆరోపణలపై భివానీ సివిల్ ఆస్పత్రి వైద్యుడు ఎడ్విన్ రంగా భిన్నంగా స్పందించారు. ధర్మేంద్ర సిబ్బందితో, తోటి రోగులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లి సిబ్బంది పట్ల తప్పుగా ప్రవర్తించారని, వారిని తిట్టాడని ఆరోపించారు. ఇక మరో వైద్యుడు మనీశ్.. ధర్మేంద్రపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.