ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసే కొన్ని పనుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు వివిధ రకాల ఆరోపణలు చేస్తుంటాయి. అంతేకాక పరిపాలను విషయంలో జరిగే లోపలను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు వినుత్నంగా నిరసనలు చేపడుతుంటారు. గుర్రంపై రావడం, గాడిదకు వినతి పత్రాలు ఇవ్వడం, రోడ్లపై వంటలు చేయడం.. ఇలా వివిధ రకాలుగా ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనలు తెలియజేస్తుంటాయి. అలానే పుదుచ్చేరిలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెరైటీగా తమ నిరసనలను తెలియజేశారు. స్కూల్ విద్యార్థుల అవతారం ఎత్తి.. సైకిళ్లపై అసెంబ్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటైన పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు అందజేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ డీఎంకే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ స్కూల్ యూనిఫామ్, ఐడీ ధరించి అసెంబ్లీకి వచ్చారు. వీటితో పాటు స్కూల్ బ్యాగ్ ధరించి.. సైకిళ్లపై పుదుచ్చేరి శాసనసభా హాలుకు చేరుకున్నారు. పాఠశాలలు ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, ఇతర వస్తువులు అందలేదని సదరు ఎమ్మెల్యేలు ఆరోపించారు.
ఎమ్మెల్యేలు స్కూలు బ్యాగులతో ఇలా అసెంబ్లీకి రావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఈ ఎమ్మెల్యేలపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక నెటిజన్లు సైతం ఈ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా సమస్యలపై పోరాడేందుకు ఏ స్థాయికైన దిగే నాయుకులే ప్రస్తుతం కావాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు సైకిళ్లపై అసెంబ్లీ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Puducherry | DMK MLAs arrived at Puducherry Legislative Assembly Hall wearing school uniforms, in protest against the govt for not providing uniforms, bicycles and laptops to the school students. pic.twitter.com/Gb0ZXlZfuC
— ANI (@ANI) February 3, 2023